Begin typing your search above and press return to search.

ప్రేక్షకులు నా నుండి ఆశించింది ఇవ్వలేక పోయా

By:  Tupaki Desk   |   8 Nov 2021 2:30 AM GMT
ప్రేక్షకులు నా నుండి ఆశించింది ఇవ్వలేక పోయా
X
2019 చివర్లో ప్రతి రోజు పండుగే సినిమా ను విడుదల చేసి సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు మారుతి ఆ తర్వాత తన సినిమా ను ఆలస్యం చేశాడు. అంతలో కరోనా వచ్చి మరింత ఆలస్యం అయ్యింది. కరోనా సమయంలోనే గోపీచంద్ తో పక్కా కమర్షియల్‌ సినిమాను చేయబోతున్నట్లుగా చెప్పడంతో పాటు అక్టోబర్‌ లో విడుదల చేస్తానంటూ ప్రకటించాడు. కరోనా ఉదృతి నేపథ్యంలో సినిమాను ప్రారంభించలేదు.. అక్టోబర్ లో విడుదల చేయలేదు. కాని హఠాత్తుగా మారుతి నుండి రోజులు మారాయి అనే సినిమా వచ్చింది. సంతోష్‌ శోభన్‌ హీరోగా మెహ్రీన్ హీరోయిన్ గా కేవలం రెండు నెలల వ్యవధిలోనే మారుతి ఆ సినిమాను పూర్తి చేశాడు. చాలా స్పీడ్‌ గా సినిమాను పూర్తి చేసినా విడుదలకు కాస్త ఆలస్యం అయ్యింది. మారుతి సినిమా అనగానే ప్రేక్షకులు బోలెడు ఎంటర్టైన్మెంట్ ను ఆశిస్తారు.

మంచి రోజులు వచ్చాయి ప్రకటించిన సమయంలోనే సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ అనే పీల్ కలిగింది. ఫస్ట్ లుక్ విడుదల తర్వాత ఆ నమ్మకం పెరిగింది. ట్రైలర్‌ లో మంచి కామెడీ ఉండబతుంది అన్నట్లుగా చెప్పారు. తీరా సినిమాకు వెళ్లి చూస్తే మాత్రం కామెడీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు పండుగ తర్వాత మారుతి నుండి వచ్చిన మంచి రోజులు వచ్చాయి సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక పోయింది అనేది వాస్తవం. ఆ విషయమై మారుతి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ నా సినిమా అనగానే ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్‌ ను ఆశిస్తారు. కాని అది ఇందులో లోపించడం వల్ల ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

మంచి రోజులు వచ్చాయి ఒక మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కించాము. అలాంటి సినిమాలను కూడా జనాలు ఆధరించాలి. అప్పుడే పెద్ద హీరోలు కూడా ఇలాంటి సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తారంటూ ప్రేక్షకులకు మారుతి విజ్ఞప్తి చేయడం జరిగింది. మంచి రోజులు వచ్చాయి సినిమాలో మిస్ అయిన ఎంటర్‌ టైన్ మెంట్ ను తాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్‌ లో అందిస్తాను అంటూ మారుతి మాట ఇచ్చాడు. ఖచ్చితంగా మంచి ఎంటర్‌ టైనర్‌ గా పక్కా కమర్షియల్ మూవీ నిలుస్తుందనే నమ్మకంను మారుతి వ్యక్తం చేశాడు. గోపీచంద్‌ కు జోడీగా ఈ సినిమాలో రాశి ఖన్నా నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పక్కా కమర్షియల్‌ పై రోజులు మారాయి ఫలితం కాస్త పడేలా కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పక్కా కమర్షియల్‌ సినిమా పాజిటివ్‌ రెస్సాన్స్ దక్కించుకుంటే మారుతి మళ్లీ ఫామ్‌ లోకి వచ్చినట్లే.