Begin typing your search above and press return to search.

'డించక్' సాంగ్: హెబ్బాతో కలిసి మాస్ స్టెప్పులతో అదరగొట్టిన రామ్..!

By:  Tupaki Desk   |   30 Dec 2020 2:24 PM GMT
డించక్ సాంగ్: హెబ్బాతో కలిసి మాస్ స్టెప్పులతో అదరగొట్టిన రామ్..!
X
యువ హీరో రామ్ పోతినేని డ్యూయల్ రోల్ పోషించిన తాజా చిత్రం ''రెడ్''. ఇది తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'తడమ్' చిత్రానికి రీమేక్ గా రూపొందింది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌ పై 'స్రవంతి' రవికిషోర్ నిర్మించారు. ఇందులో రామ్ సరసన మాళవిక శర్మ - నివేథ పేతురాజ్ - అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటించారు. హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ముమ్మరం చేసింది. ఇటీవలే 'రెడ్' ట్రైలర్ ని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా 'రెడ్' నుంచి 'డించక్' అనే ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేసారు.

సంగీత బ్రహ్మ మణిశర్మ 'డించక్' సాంగ్ కి.మాంచి మాస్ బీట్ ని అందించాడు. 'ఎక్కడీ దానవే చక్కనీ కోమలి.. ఒక్కదానివున్నావేందే.. వస్తావా భీమిలి..' అంటూ సాగిన ఈ ఐటమ్ నెంబర్ కి కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశాడు. సాకేత్ మరియు కీర్తన శర్మ కలిసి ఎనర్జిటిక్ గా ఈ సాంగ్ ని ఆలపించారు. దీనికి జానీ మాస్టర్ అదిరిపోయే కొరియోగ్రఫీ చేసాడు. ఇందులో హెబ్బా పటేల్ తో కలిసి రామ్ మాస్ స్టెప్స్ తో అదరగొట్టాడు. ఇంకా హెబ్బా పటేల్ అయితే అబ్బా అనే రేంజ్ లో అందాలు ఆరబోసినట్లు అర్థం అవుతోంది. మణిశర్మ కొట్టిన ఈ మాస్ బీట్ సంక్రాంతికి థియేటర్స్ లో బ్లాస్ట్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తం మీద ఈ ఐటమ్ సాంగ్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.youtube.com/watch?v=Ks-hZ4pTUL4&feature=youtu.be