Begin typing your search above and press return to search.

సారా కోసం డింపుల్ ఆంటీ సాయం

By:  Tupaki Desk   |   14 April 2018 2:30 PM GMT
సారా కోసం డింపుల్ ఆంటీ సాయం
X
సైఫ్ అలీ ఖాన్ పెద్ద కూతురు సారా అలీ ఖాన్ బాలీవుడ్ లో హీరోయిన్ గా చేసేందుకు తెగ ఉత్సాహంగా ఉంది. యంగ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జోడిగా ‘కేధ‌ర్ నాథ్‌’ చిత్రంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెఢీ అవుతోంది సారా. ఉత్త‌రాఖండ్ లో అతి క్లిష్ట‌మైన వాతావ‌ర‌ణంలో షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రం అనుకోని ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా చిక్కుల్లో ప‌డింది. దీన్ని కాపాడేందుకు ఓ సీనియ‌ర్ హీరోయిన్ ముందుకొచ్చిన‌ట్టు స‌మాచారం.

సైఫ్ అలీ ఖాన్ మొద‌టి భార్య అమ్రితా సింగ్‌... బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి డింపుల్ క‌పాడియా మంచి స్నేహితులు. అమ్రితాను ముద్దుగా డింగీ అని... డింపుల్ ని డింపూ అని పిలుస్తుంటారు. ఇప్ప‌టికీ వీళ్లిద్ద‌రూ ఫ్యాష‌న్ పార్టీల్లో త‌ర‌చూ క‌లుస్తుంటారు. అమ్రితా సింగ్ కూతురు సారా అలీ ఖాన్ మొద‌టి సినిమా ఫైనాన్షియ‌ల్‌ కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింద‌ని తెలుసుకున్న డింపుల్‌... చాలా బాధ‌ప‌డింద‌ట‌. అమ్రితా డింపుల్ కి కేధ‌ర్ నాథ్‌ సినిమా గురించి చెప్ప‌గానే... ఆర్థిక క‌ష్టాల నుంచి గ‌ట్ట‌క్కించేందుకు ఎవ‌రు సాయం చేయ‌గ‌ల‌రో వెత‌క‌డం మొద‌లెట్టింద‌ట డింపుల్‌. అదృష్ట‌వ‌శాత్తు యూటీవీ గ్రూప్ అధినేత రొన్నీ స్కెవ్రాలా సినిమాను గ‌ట్టేక్కించేందుకు ముందుకొచ్చాడు.

పెరిగిపోయిన బ‌డ్జెట్ కార‌ణంగా ఆగిపోయిన సినిమాను తిరిగి మొద‌లుపెట్టేందుకు రోన్నీ... నిర్మాత ప్రేర‌ణ ఆరోరాకి 15 కోట్లు ఇచ్చాడ‌ని స‌మాచారం. కేధ‌ర్ నాథ్ సినిమాను విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు అభిషేక్ కపూర్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత సారా అలీ ఖాన్‌... టెంప‌ర్ రీమేక్ చిత్రం సింబాలో ర‌ణ‌వీర్ సింగ్ ప‌క్క‌న న‌టించ‌బోతోంది.