Begin typing your search above and press return to search.

తనుశ్రీ ఎపిసోడ్లో డింపుల్ శాంపిల్

By:  Tupaki Desk   |   1 Oct 2018 4:48 PM GMT
తనుశ్రీ ఎపిసోడ్లో డింపుల్ శాంపిల్
X
బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా సీనియర్ యాక్టర్ నానా పటేకర్ పై ఆరోపణలు చేసిన ఎపిసోడ్ లో తాజా పరిణామాలు నెమ్మదిగా నానా కు వ్యతిరేకంగా మారుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఇప్పటికే తనుశ్రీ - తన తల్లిదండ్రులతో ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగిన వీడియో బయటకు వచ్చింది. ఈ విషయం గురించి తనుశ్రీ పదేళ్ళ క్రితమే మాట్లాడిందట.. నానా - కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తో కలిసి నానా తనుశ్రీ ని లైంగికంగా వేధించారని.. ప్రతిఘటించినందుకు ఎంఎన్ఎస్ పార్టీ వర్కర్స్ చేత దాడి చేయించారని చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదట. కానీ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అదే విషయం చెప్తే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ప్రియాంక చోప్రా.. ఫర్హాన్ అఖ్తర్.. స్వర భాస్కర్.. రిచా ఛద్దా.. సోనమ్ కపూర్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇప్పుడు తనుశ్రీ కి మద్దతు ప్రకటించారు. ఇక తాజాగా నానా పటేకర్ గురించి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ డింపుల్ కపాడియా మాట్లాడిన పాత వీడియో బైట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నానా గురించి అడిగితే "టాలెంట్ విషయంలో అయనతో సాటిరాగల వాళ్ళు లేరు. చాలా టాలెంటెడ్ పర్సన్. అలాంటి టాలెంట్ ఉన్నవారు చేసినప్పుడు తన వంద తప్పుల్ని క్షమించేస్తాను. అన్నీ క్షమించేస్తాను. ఒక మనిషిగా అయన నాతో చాలా మర్యాదగా.. ఒక మంచి స్నేహితుడిగా ఉండేవాడు. కానీ నేను అయనలోని చీకటి కోణాన్ని కూడా చూశాను. మనందరికీ చీకటి కోణం ఉంటుంది గానీ దాన్ని జాగ్రత్తగా దాచిపెడతాం" అని చెప్పింది.

ఈ వీడియో బయటకు వచ్చినప్పటినుండి నానా పై విమర్శల జోరు మరింతగా పెరిగింది. నానా పై తనుశ్రీ చేసిన ఆరోపణలు నిజమేనని.. నానా వల్ల ఇబ్బంది పడిన వారు ఇంకా ఉండొచ్చని అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.