Begin typing your search above and press return to search.

బ్లాక్ అండ్ వైట్ లో ఇంత‌కీ ఏం దాగుంది?

By:  Tupaki Desk   |   11 Aug 2022 4:28 PM GMT
బ్లాక్ అండ్ వైట్ లో ఇంత‌కీ ఏం దాగుంది?
X
డింపుల్ హయాతి టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన హాట్ గాళ్. ఆరంభం తమిళ చిత్ర పరిశ్రమలో వ‌రుస చిత్రాల్లో న‌టించింది. అభినేత్రి 2- దేవి 2 వంటి చిత్రాలలో న‌టించింది. వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ లోని ఐటెమ్ నంబర్ జర్రా జర్రాలో డింపుల్ ప్రత్యేకంగా కనిపించింది.

ఐటెం సాంగ్ లో తన అందచందాలు ఎన‌ర్జిటిక్ డ్యాన్సులతో అభిమానుల మనసు దోచుకుంది. దీంతో ఆమెకు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల మాస్ మ‌హారాజా స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టించినా అది త‌న కెరీర్ కి క‌లిసి రాలేదు. కానీ త‌దుప‌రి త‌న‌ని తాను నిరూపించుకునేందుకు పూర్తి కాన్ఫిడెన్స్ ని క‌న‌బ‌రుస్తోంది.

సోషల్ మీడియాల్లో ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే.

డింపుల్ హాట్ ఫోటోషూట్ ల‌ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయ‌గా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజా లుక్ లో డింపుల్ హయాతి బ్రాలెస్ (టాప్ లెస్‌) లుక్ లో క‌నిపించింది. టాప్ లెస్ గా క‌నిపించినా కానీ దానిని బ్లాక్ కోట్ తో క‌వ‌ర‌ప్ చేసింది. ఈ ఫోటోషూట్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది.

ఓహ్.. నిన్ను చూడు.. నమ్మశక్యం కాని అద్భుతానివి అని ఒక అభిమాని పొగిడేయ‌గా... మరొక అభిమాని ఇలా రాశాడు. మీరు ఇన్ స్టాను తీవ్రంగా కదిలిస్తున్నారు అంటూ పొగిడేశాడు. మీ శైలి అద్భుతం.. మీరు ఆ శైలిలో ఒక ప్రత్యేకమైన న‌టి అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

అందాల డింపుల్ ఫోటోషూట్ ల కోసం బోల్డ్ గా క‌నిపించేందుకు ఎప్పుడూ వెనుకాడదు. డింపుల్ హయాతి ఇటీవ‌ల‌ సోషల్ మీడియాల్లో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో తన స్టీమీ లుక్స్ తో మ‌తులు చెడ‌గొడుతోంది.