Begin typing your search above and press return to search.

విజ‌య‌వాడ బ్యూటీ క‌స‌క్...మాస్ రాజా ఫ‌స‌క్!

By:  Tupaki Desk   |   8 Feb 2022 5:30 PM GMT
విజ‌య‌వాడ బ్యూటీ క‌స‌క్...మాస్ రాజా ఫ‌స‌క్!
X
విజ‌య‌వాడ బ్యూటీ డింపుల్ హ‌య‌తి మాస్ రాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `ఖిలాడీ`లో హీరోయిన్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `గ‌ల్ఫ్` అనే ఓ చిన్న చిత్రంతో న‌టిగా ప‌రిచ‌య‌మైన డింపుల్ హ‌య‌తి కెరీర్ లో వేగంగా అగ్ర హీరోల‌తో అవ‌కాశాలు అందుకుంది. కోలీవుడ్ లో కార్తి..విశాల్ లాంటి స్టార్ హీరోల స‌ర‌స‌న ఛాన్సులు అందుకుంది. కానీ సక్సెస్ ల ప‌రంగా వెనుక‌బ‌డే ఉంది. మ‌రో బిగ్ ఛాన్స్ అదీ టాలీవుడ్ లోనే `ఖిలాడీ` రూపంలో ద‌క్కింది. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న చిత్రంపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఇటీవ‌లే ట్రైల‌ర్ కూడా రిలీజ్ అయింది.

ఇందులో డింపుల్ హ‌య‌తి బోల్డ్ అటెంప్ట్ చేసింది. ఓ సీన్ లో బ్యూటీ బికినీ షోతో ఆక‌ట్టుకుంటోంది. న‌డుము ఒంపు సొంపులు..నాభి అందాల ఎలివేష‌న్స్ తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. మాస్ రాజాతో రొమాంటిక్ స‌న్నివేశాల్లో చెల‌రేగిన‌ట్లే క‌నిపిస్తోంది. తెలుగు బ్యూటీ అయినా లాంగ్ షాట్స్ లో గ్లామర్ షోకి ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని ట్రైల‌ర్ చూస్తే తెలుస్తోంది. బ్యూటీ ఫేస్ లో పూజా హెగ్డే పీచ‌ర్స్ క‌నిపిస్తున్నాయి. ఇది డింపుల్ హ‌య‌తికి క‌లిసొస్తుందా? లేదా? అన్న‌ది త‌ర్వాత తేలుతుంది. అయితే టాలీవుడ్ సెంటిమెంట్ ప్ర‌కారం చూస్తే ముందుగా ప‌రిచ‌య‌మైన హీరోయిన్ పీచ‌ర్స్ త‌ర్వాత వ‌చ్చిన హీరోయిన్ల‌లో క‌నిపిస్తే వ‌ర్కౌట్ అయిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. పైగా ఆ సెంటిమెంట్ నెగిటివ్ గా మారుతుంది.

మ‌రి డింపుల్ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇక `ఖిలాడీ`లో మ‌రో హీరోయిన్ గా న‌టించిన మీనాక్షి చౌద‌రి రొమాంటిక్ సీన్స్ లో ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది. లిప్ లాక్ స‌న్నివేశాల‌తో హీట్ పెంచుతోంది. రాజాతో కెమిస్ర్టీ బాగానే వ‌ర్కౌట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ భామ‌ల ఫేట్ మార్చేది స‌క్సెస్ మాత్ర‌మే. క‌మ‌ర్శియ‌ల్ గా సినిమా స‌క్సెస్ అయితే హీరోయిన్లగా లైమ్ లైట్ లోకి వ‌చ్చిన‌ట్లే. ముఖ్యంగా ఈ సినిమా స‌క్సెస్ డింపుల్ హ‌య‌తికి చాలా కీల‌కం. ఇదే నెల‌లో ఆమె విశాల్ స‌ర‌స‌న న‌టించిన `సామాన్యుడు` కూడా బాక్సాఫీస్ వ‌ద్ద అంచానాల్ని అందుకోలేక‌పోయింది. ఈ శుక్ర‌వార‌మే `ఖిలాడీ` ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. మ‌రి విజ‌య‌వాడ బ్యూటీ ఏమేర ఆక‌ట్టుకుంటుందో చూద్దాం.