Begin typing your search above and press return to search.

ఈ కుర్రభామ ఆశలన్నీ ఆ సినిమా పైనే..!

By:  Tupaki Desk   |   29 April 2021 3:30 AM GMT
ఈ కుర్రభామ ఆశలన్నీ ఆ సినిమా పైనే..!
X
సినిమా ప్రపంచంలో కొందరు హీరోయిన్స్ ఇలా అడుగు పెట్టగానే అలా స్టార్డం వచ్చేస్తుంది. కానీ కొందరికి మాత్రం ఎన్నేళ్ళైనా అలాగే స్టార్డం లేకుండా అలా హీరోయిన్ గానే మిగిలిపోతారు. ఈ మధ్యకాలంలో సైడ్ క్యారెక్టర్స్ చేసి స్టార్ హీరోలతో సినిమాలు చేసినవారు ఉన్నారు. కానీ అందం టాలెంట్ రెండూ ఉండి కూడా అవకాశాల గురించి ఎదురు చూస్తుంటారు. అలాంటి యంగ్ బ్యూటీలలో ఒకరు డింపుల్ హయాతి. ఈ వయ్యారి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 4ఏళ్లు గడిచింది. కానీ ఇంతవరకు సరైన అవకాశాలు రాలేదు. అలాగని వచ్చిన అవకాశాలతో క్రేజ్ కూడా రాలేదు. కానీ ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంది. గల్ఫ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హయాతి.. తర్వాత యూరేకా సినిమా చేసింది.

ఆ రెండు బోల్తా కొట్టడంతో లాభం లేదని గడ్డలకొండ గణేష్ సినిమా ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఆ పాటలో ఏకంగా అదిరిపోయే అందాల ప్రదర్శన చేసింది. దాదాపు ఏడాది తర్వాత మాస్ రాజా ఖిలాడి సినిమాలో ఓ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ వయ్యారి ఆశలన్నీ ఖిలాడి సినిమా పైనే ఉన్నాయని తెలుస్తుంది. ఇదివరకే ఎలాంటి భాషాబేధం లేకుండా సినిమాలు చేస్తానని చెప్పింది హయాతి. ఆ మధ్యలో తమిళం వైపు కూడా లుక్కేసినట్లు తెలిపింది. కానీ ప్రస్తుతం అమ్మడి చేతిలో ఉంది ఖిలాడి మాత్రమే. అలాగే పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లో కూడా హయాతి భాగమైనట్లు టాక్ నడుస్తుంది. ఒకవేళ ఖిలాడి గనక హిట్ అయితే మాత్రం ఈ ముప్పై రెండేళ్ల కుర్రది బిజీ కావడం మాత్రం పక్కా అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఈ తెలుగు బ్యూటీ కెరీర్ ఖిలాడి మారుస్తుందేమో!