Begin typing your search above and press return to search.

జర్రా జర్రా పాప దశ దిశా మారిందట!

By:  Tupaki Desk   |   25 Sep 2019 1:30 AM GMT
జర్రా జర్రా పాప దశ దిశా మారిందట!
X
మనం ఫ్లాపుల్లో ఉంటే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు.. అదే హిట్టులో ఉంటే జనాలందరూ మన చుట్టూనే ఉంటారు. మెజారిటీ సందర్భాల్లో అందులోనూ ఫిలిం ఇండస్ట్రీలో ఇది నిజ్జంగా నిజం. ఎందుకంటే కొందరు మహానుభావులు మాత్రం హిట్ ఫ్లాపుతో సంబంధం లేకుండా జస్ట్ టాలెంట్ మాత్రం చూసి అవకాశాలు ఇస్తారు. అయితే అది తక్కువ సందర్భాలు కాబట్టి మన మెజారిటీ జనాల గురించే మాట్లాడుకోవాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన 'గద్దలకొండ గణేష్' సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. హిట్ గా నిలిచే అవకాశాలు ఫుల్ గా ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు పనిచేసిన వారిపై అందరి దృష్టి పడింది.

ఈ సినిమాతో వరుణ్ తేజ్ కు.. మిక్కీ జె మేయర్ కు మాస్ ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమాలో జర్రా జర్రా పాట సూపర్ హిట్ గా మారింది. ఈ పాటలో కత్తి లాంటి స్టెప్పులు వేసిన పాప డింపుల్ హయతికి ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. ఈ పాటలో సూపర్ డ్యాన్స్ తో పాటు గ్లామర్ ను కూడా ధారాళంగా ఒలికించడంతో టాలీవుడ్ ఫిలిం మేకర్ల దృష్టిలో పడిందట. అంతే కాదు ఈ భామ కూడా స్వతహాగా గ్లామరసం చిందించే న్యూ జెనరేషన్ భామ కావడంతో సోషల్ మీడియాను కూడా ఎప్పటినుంచో వేడెక్కిస్తూనే ఉంది. ఈ విషయాలను ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న కొందరు ఫిలిం మేకర్లనుంచి డింపుల్ కు ఎంక్వైరీలు పెరిగాయట. మేము ఆఫర్ ఇస్తాం అంటే మేమిస్తాం అంటూ డింపుల్ తలుపు తడుతున్నారట.

అంతా బాగానే ఉంది కానీ వీరిలో అందరూ జెన్యూన్ గా అవకాశాలు ఇచ్చేవారు అయి ఉంటే మేలు.. #మీటూ బాపతు జనాలు అయి ఉండకపోతే అదే పదివేలు. అదేదే యాడ్ లో 'ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది' అని చెప్పినట్టు ఈ పాప కెరీర్ ను ఒక్క జర్రా జర్రా పాట పూర్తిగా మార్చేసింది. బ్రేక్ అంటే ఇదేనేమో!