Begin typing your search above and press return to search.

దిల్ రాజు గారి సెల్ఫీ అదిరింది కదా

By:  Tupaki Desk   |   13 May 2020 2:20 PM IST
దిల్ రాజు గారి సెల్ఫీ అదిరింది కదా
X
లాక్ డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోయాయి.. రిలీజులు ఆగిపోయాయి.. సినిమా పరిశ్రమ అంతా శెలవులు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఈ లాక్ డౌన్ పీరియడ్ లోనే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పెళ్లి చేసుకుని అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు. కోవిడ్ -19 కారణంగా ఎక్కువమంది హాజరయ్యే అవకాకాశం లేకపోవడంతో అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో నిజామాబాద్ లో రాజు గారి వివాహం జరిగింది.

దిల్ రాజు వివాహం ఫోటోలు.. శ్రీమతి గారి పేరు ఇప్పటికే మీడియాలో వచ్చాయి. వీటికి తోడు తాజాగా కొత్త జంట తీసుకున్న సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సెల్ఫీని రాజుగారి సతీమణి వైఘా రెడ్డి తీయడం విశేషం. ఇందులో దిల్ రాజు తన వయసు కంటే ఎంతో తక్కువగా.. యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. కొత్త జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అంతే కాకుండా చాలామంది నెటిజన్లు కొత్త దంపతులకు బెస్ట్ విషెస్ చెప్తున్నారు. రాజుగారి కూతురు సోషల్ మీడియాలో.. "నాన్నా నువ్వు సంతోషంగా ఉండాలి" అంటూ టచింగ్ పోస్ట్ పెట్టిన సంగతి తెల్సిందే.