Begin typing your search above and press return to search.

'ప్రభాస్'తో దిల్ రాజు కొత్త సినిమా సాధ్యమేనా..?

By:  Tupaki Desk   |   9 May 2020 9:00 PM IST
ప్రభాస్తో దిల్ రాజు కొత్త సినిమా సాధ్యమేనా..?
X
తెలుగు ఇండస్ట్రీలో విజయవంతమైన సినిమాల నిర్మాతగా కొనసాగుతున్నారు దిల్ రాజు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ సినిమాను నిర్మిస్తున్న ఆయన తాజాగా మరోసారి డార్లింగ్ ప్రభాస్ తో ఓ సినిమా చేయాలనీ ఆరాటపడుతున్నారట. ఇంతకుముందు ప్రభాస్-దిల్ రాజు కాంబినేషన్లో 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమా రూపొంది మంచి విజయం అందుకుంది. అయితే ప్రభాస్ కూడా ఈ మధ్య ఎవరైనా మంచి స్క్రిప్ట్ తో వస్తే చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు. దిల్ రాజుతో కూడా మంచి స్క్రిప్ట్ తో వస్తే చేస్తానని హామీ ఇచ్చాడట ప్రభాస్. ఇప్పటికే కొందరు డైరెక్టర్ల కథలు విని నచ్చక నో చెప్పాడట ప్రభాస్. తాజాగా వకీల్ సాబ్ డైరెక్టర్ వేణుశ్రీరాం దిల్ రాజుకి ఓ లైన్ వినిపించాడట. ఆ లైన్ నచ్చడంతో దిల్ రాజు ఆ కథను త్వరగా డెవలప్ చేసి స్క్రిప్ట్ రెడీ చెయ్యిమని చెప్పినట్లు సమాచారం.

వెంటనే లాక్ డౌన్ పూర్తవగానే ఆ స్క్రిప్ట్ ప్రభాస్ కి వినిపించి తన తదుపరి సినిమాకు లాక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట దిల్ రాజు. ప్రస్తుత లాక్ డౌన్ సమయాన్ని ఆ స్క్రిప్ట్ రెడీ చేయడానికి వెచ్చిస్తున్నాడట వేణు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ లో విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ప్రభాస్ కి జోడిగా బుట్టబొమ్మ పూజహెగ్డే రొమాన్స్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. ఆ సినిమా 2020లో విడుదల అవుతుందని ఇటీవలే నిర్మాత తెలిపారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత దిల్ రాజు స్క్రిప్ట్ లైన్ లో పెట్టాలని చూస్తున్నాడు. చూడాలి మరి ఏం జరగనుందో..!