Begin typing your search above and press return to search.
దిల్ రాజుకి మళ్ళీ పెళ్లి చేసింది వాళ్ళే...!
By: Tupaki Desk | 13 May 2020 1:20 PM ISTటాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న బడా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. తాను నిర్మించిన 'దిల్' సినిమాతో 'దిల్ రాజు'గా మారిపోయిన వెంకట రమణారెడ్డి టాలీవుడ్ లో తిరుగులేని నిర్మాతగా కొనసాగుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఏర్పాటు చేసి వరుస చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటున్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వెంకట రమణా రెడ్డి ఆ తర్వాత రోజుల్లో ప్రొడ్యూసర్ గా మారి సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేసాడు. కాగా మూడేళ్ళ క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యం కారణంగా మరణించడంతో ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే ‘దిల్ రాజు’ ఈ మధ్య వివాహం చేసుకున్నారు. తన స్వస్థలమైన నిజామాబాద్ లోని వెంకటేశ్వర స్వామి గుడిలో దిల్ రాజు వివాహం జరిగింది. ప్రభుత్వ సూచనల మేరకు ఈ వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని సమాచారం.
50 ఏళ్లకు పైగా వయసున్న దిల్ రాజు మూడు పదుల వయసున్న హైదరాబాద్ లో నివాసం ఉండే వైగా రెడ్డిని వివాహం చేసుకున్నాడు. వైగా రెడ్డి గతంలో ఎయిర్ హోస్టెస్ గా పని చేసిందట. అయితే దిల్ రాజు భార్య మరణం తర్వాత ఈ వయసులో సెకండ్ మ్యారేజ్ చేసుకోడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలని అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. దిల్ రాజు భార్య మరణం తర్వాత సింగిల్ గా ఉంటూ బాధ పడుతూ ఉండేవాడట. కానీ రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచనే ఆయనకు లేదట. కానీ ఆయన అలా రోజూ బాధపడటం చూసి ఆయన తమ్ముళ్లు దిల్ రాజుని మరో పెళ్లి చేసుకోవాలని కోరారట. అంతేకాకుండా దిల్ రాజు కూతురు మరియు ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన ఒంటరిగా ఇలా బాధ పడుతూ ఉంటే డిప్రెషన్ కి గురవుతాడని భావించి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ప్రెజర్ చేశారట.
దీంతో మరో పెళ్లి చేసుకోమని కుటుంబ సంభ్యులు సన్నిహితులు ఎప్పటినుండో కోరుతూ ఉండటంతో దిల్ రాజు రెండో వివాహానికి అంగీకరించారట. దీనికోసం దిల్ రాజు సొంత ఊరి వాళ్ళు కూడా ఆయనకి అమ్మాయిని వెతికే ప్రయత్నాలు చేశారట. చివరికి హైదరాబాద్ లో నివాసం ఉంటున్న అదే గ్రామానికి చెందిన వైగా రెడ్డిని దిల్ రాజుకు ఇచ్చి వివాహం జరిపించారట. అయితే మంచి ముహూర్తం చూసి గ్రాండ్ గా చేయాలని భావించినప్పటికీ కరోనా లాక్ డౌన్ కారణంగా అది సాధ్యపడలేదు. చివరికి సింపుల్ గా నిజామాబాద్ గుడిలో వివాహం జరిపించారు. మొత్తం మీద దిల్ రాజు కుటుంబ సభ్యులు మరియు వారి స్వగ్రామస్తులు దిల్ రాజుకి మళ్ళీ పెళ్లిచేశారన్నమాట.