Begin typing your search above and press return to search.

దిల్ రాజు 'వారసుడు' తెలుగు కాదట!

By:  Tupaki Desk   |   2 Aug 2022 9:35 AM GMT
దిల్ రాజు వారసుడు తెలుగు కాదట!
X
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'వారసుడు' అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను మొన్నటి వరకు తెలుగు సినిమా అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు.

విజయ్ నటిస్తున్న మొదటి తెలుగు సినిమా అంటూ తమిళ్‌ మీడియాతో పాటు తెలుగు మీడియాలో కూడా ప్రముఖంగా యూనిట్‌ సభ్యులు ప్రచారం చేయడం జరిగింది.

ఇప్పుడు ఉన్నట్లుండి దిల్‌ రాజు కాంపౌండ్ కు చెందిన వారు వారసుడు సినిమా తెలుగు సినిమా కాదని.. తమిళ్ సినిమా అంటున్నారు. నిర్మాతల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు షూటింగ్స్ ను చేయమంటూ ఆగస్టు 1 నుంచి బంద్ ప్రకటించిన విషయం తెల్సిందే. దిల్‌ రాజు బ్యానర్‌ లో రూపొందుతున్న వారసుడు మాత్రం షూటింగ్‌ కంటిన్యూ అవుతోంది.

తెలుగు సినిమా కాని కారణంగా వారసుడు సినిమా షూటింగ్‌ ను కంటిన్యూ చేస్తున్నామని.. ఇందులో వివాదం అక్కర్లేదు అంటూ దిల్‌ రాజు కాంపౌండ్‌ వారు మీడియా వర్గాల వారితో అన్నట్లుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్‌ నిలిచి పోకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశ్యంతో దిల్ రాజు వారసుడు ను తెలుగు సినిమా కాదని చెప్పేశారు.

తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు లో డబ్బింగ్‌ చేస్తారని క్లారిటీ వచ్చింది. ఈ ఇష్యూ జరగకుండా ఉంటి ఉంటే ఖచ్చితంగా దిల్‌ రాజు వారసుడు తెలుగు సినిమా అని.. తమిళంలో డబ్బింగ్‌ చేశామని లేదంటే అక్కడ ఇక్కడ రెండు వేరు వేరు వర్షన్‌ లుగా షూట్‌ చేశామని ప్రచారం చేసేవారు.

ఇప్పటికే దిల్‌ రాజు ఇష్యూలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్‌ లను నిలిపి వేయడం ద్వారా సాధించేది ఏంటో అర్థం కావడం లేదని సినీ కార్మికులతో పాటు కొందరు నిర్మాతలు కూడా వాదిస్తున్నారు. దిల్‌ రాజు మరియు ఇతర యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ నిర్మాతలు మాత్రం షూటింగ్ లు నిలిపి వేయాల్సిందేనంటున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.