Begin typing your search above and press return to search.

నితిన్ కళ్యాణం.. కాదు మూడు కళ్యాణాలు..

By:  Tupaki Desk   |   10 July 2018 6:49 AM GMT
నితిన్ కళ్యాణం.. కాదు మూడు కళ్యాణాలు..
X
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తనకు ఆది నుంచి కలిసి వచ్చిన లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కాన్సెప్ట్ ను నమ్మి మరో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అన్న పాయింట్ తో నితిన్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్ గా ‘శ్రీనివాస కళ్యాణం’ పేరుతో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా సెకండాఫ్ మొత్తం పల్లెటూరులో జరిగే పెళ్లి హడావుడి మీదనే తెరకెక్కిస్తున్నారట.. అయితే ఒక పెళ్లి కాదట.. సినిమా మొత్తం మూడు పెళ్లిళ్లు ఉంటాయట.. క్లైమాక్స్ లో జరిగేది హీరో హీరోయిన్ల పెళ్లి అన్నమాట.. ఈ మూడు పెళ్లిళ్లకు కలిపి పెళ్లి పరమార్థంపై మాంచి అర్థవంతమైన పాటను రాయించారు. శతమానం భవతి సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అద్భుతమైన బాణీలతో పెళ్లి పాటను బాలు చేతే పాడించారు.

దిల్ రాజు ఇదివరకూ ఇలాంటి చిత్రాలే తీసి హిట్స్ కొట్టాడు. బొమ్మరిల్లు - సీతమ్మ వాకిట్లో - శతమానం భవతి తరహాలోనే ఇప్పుడు నాలుగో చిత్రంగా ‘శ్రీనివాస కళ్యాణం’ వస్తోంది. ప్రకాష్ రాజ్ ను కీలక పాత్రలో తీసుకొని చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్ తో వస్తున్న ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే.