Begin typing your search above and press return to search.

ఆ హీరో ఇంటిని పడగొడుతున్న పాక్

By:  Tupaki Desk   |   19 Jun 2017 12:52 PM IST
ఆ హీరో ఇంటిని పడగొడుతున్న పాక్
X
హిందీ సినిమా తొలి త్రిమూర్తులు గా పేరు గడించిన రాజ్ కపూర్ - దిలీప్ కుమార్ - దేవానంద్ లలో దిలీప్ సాబ్ ను బాలీవుడ్ తొలి కమర్షియల్ హీరోగా దేశం గర్వించదగ్గ నటుడుగా సినిమా నటనకు ఆది గురువుగా చెప్పుకోవచ్చు. దిలీప్ కుమార్ దేశ విభజన కు ముందు పాకిస్తాన్ లో ఉండేవారు. ఆయనకు పదేల్ళు ఉన్నప్పుడూ మహారాష్ట్ర కు వలస వచ్చారు.

మ్యాటర్ ఏంటంటే.. పాకిస్తాన్ లో ఉన్న అతని పూర్వీకుల ఇంటిని ఇప్పుడు అక్కడ ప్రభుత్వం పడగొట్టి గ్రంధాలయం గాని మ్యూజియం గాని కట్టే ప్రయత్నాలు చేస్తోందట. ఆల్రెడీ పడగొట్టడం స్టార్ట్ చేశారు కూడా. ఇదే విషయం పై దిలీప్ కుమార్ సతీమణి సైరా బాను తన ఆశాభావాన్ని వ్యక్త పరిచారు. “అతను చిన్న తనంలో అక్కడే గడిచింది అందువలన ఆ ఇంటితో చాలా అనుభంధం ఉందిని చెప్పారు. చాలా ఏళ్ళు కిందట అక్కడకు వెళ్ళాం అప్పటికే ఆ ఇల్లు పూర్తిగా శిథాలవస్తలో ఉంది. అక్కడ కొంత మంది ఫాన్స్ దాన్ని కాపాడుతూ వచ్చారు. దిలీప్ కుమార్ ప్రతి పుట్టిన రోజు పెషావర్ లో ఉన్న ఫాన్స్ ఘనంగా జరిపేవాళ్లు. వాళ్ళు నుండి వచ్చే సందేశాలు అప్పుడుప్పుడు అక్కడ పరిస్థితి తెలిసేది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిసింది. ఇంతకు ముందు కూడా ఇలానే చాలా ప్రమాణాలు చేశారు కానీ ఏది అమలుకాలేదు'' అంటూ సెలవిచ్చింది.

మనం అమెరికా వెళ్ళితే అక్కడ గొప్ప పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ ఇల్లు కూడా మ్యూజియం లా మార్చి అక్కడ ప్రభుత్వం కాపాడుతోంది. అలానే దిలీప్ సాబ్ ఇంటిని కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ చేస్తుంది అని ఆశాభావం తో ఉన్నారు సైరా బాను. దిలీప్ కుమార్ ఇల్లు మాత్రమే కాదు చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ఇల్లులు ఇంకా అక్కడ మిగిలే ఉన్నాయి. బాలీవుడ్ నిన్నటి తరం స్టార్ హీరో స్వర్గీయ వినోద్ ఖన్నా ఇల్లు, కింగ్ ఖాన్ షారుక్ పూర్వీకుల ఇల్లు కూడా పెషావర్ సిటీ లో ఉంది. కొన్ని జ్ఞాపకాలు ఇలానే ఉంటాయి.. తిరిగి ఎప్పటికీ వెళ్ళలేము.. ఆ జ్ఞాపకాన్ని ఎప్పటికీ వదలలేమూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/