Begin typing your search above and press return to search.

సినిమా హిట్టు.. కేసులో పట్టు

By:  Tupaki Desk   |   29 Sept 2017 10:47 AM IST
సినిమా హిట్టు.. కేసులో పట్టు
X
మలయాళ హీరో దిలీప్ ఇప్పటికీ జైల్ లోనే ఊచలు లెక్కపెడుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో జరిగిన హీరోయిన్ కిడ్నాప్.. వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటోన్న దిలీప్.. రీసెంట్ గా ఐదోసారి బెయిల్ పిటిషన్ వేశాడు. ముందు నాలుగు సార్లు పిటిషన్ తిరస్కరణకు గురికాగా.. ఈ సారి జరిగిన వాదోపవాదాల్లో ప్రాసిక్యూషన్.. సీరియస్ ఆరోపణలే చేసింది.

ఆ హీరోయిన్ కిడ్నాప్ వ్యవహారంలో కోటిన్నర.. పోలీసులకు పట్టుబడితే మరో కోటిన్నర చొప్పున.. మొత్తం 3 కోట్ల రూపాయలను పల్సర్ సునికి ఇచ్చేందుకు దిలీప్ ఒప్పందం చేసుకున్నాడని.. ఇంతటి తీవ్రమైన నేరం చేసిన వ్యక్తికి బెయిల్ ఇవ్వరాదని ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో ఈ కేసులో బెయిల్ రాకపోగా.. తీర్పు మరోసారి వాయిదా పడింది. రియల్ లైఫ్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇలా కంటిన్యూ అవుతుంటే.. దిలీప్ నటించిన రామ్ లీలా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. దసరా సందర్భంగా నిన్న రిలీజ్ అయిన ఈ చిత్రానికి.. కేరళ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ఇది పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కావడం మరింత విశేషం.

ఒకవైపు ఈ హీరో కేసులో ఇరుక్కుని జైల్లో ఉంటే.. ఆ హీరో నటించిన సినిమాకు మాత్రం ఫ్యాన్స్ నుంచి ఫుల్లు ఆదరణ దక్కడంతో పాటు.. హౌస్ ఫుల్స్ తో నడుస్తుండడం.. హిట్ టాక్ తో దూసుకుపోతుండడం ఆశ్చర్యకరమే. రియల్ లైఫ్ ను పక్కన పెట్టి మరీ.. సినిమాను ఆదరిస్తున్నారు కేరళ జనాలు. ఒకేసారి రెండురకాల పరిస్థితులతో ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కాని పరిస్థితి దిలీప్ కి ఏర్పడింది.