Begin typing your search above and press return to search.

త‌న‌ చివ‌రి సినిమా పేరుకే చేరుకున్న హీరో

By:  Tupaki Desk   |   12 July 2017 7:13 AM GMT
త‌న‌ చివ‌రి సినిమా పేరుకే చేరుకున్న హీరో
X
పాపం పండ‌టానికి ఎక్కువ కాలం ప‌ట్ట‌టం లేదు. చేసిన త‌ప్పు ఏదైనా స‌రే.. వెనువెంట‌నే అనుభ‌వించే రోజులు వ‌చ్చేశాయి అని కొంద‌రు త‌ర‌చూ చెబుతుంటారు. తాజా ఉదంతం చూస్తే.. ఈ మాట‌ల్లో నిజం ఉంద‌ని అనిపించ‌క మాన‌దు. మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లో అగ్ర‌హీరోల్లో ఒక‌రైన దిలీప్ ఇప్పుడు పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోవ‌ట‌మే కాదు.. రీల్ హీరో రియ‌ల్ గా ఇంత విల‌నా? అంటూ చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర్గాలే కాదు.. ఆయ‌న్ను అమితంగా అభిమానించిన అభిమానులంతా వేద‌న చెందుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే దిలీప్ చివరి సూప‌ర్ హిట్ సినిమా పేరేంటో తెలుసా.. వెల్‌కం టు సెంట్ర‌ల్ జైలు.

ఈ సినిమా పేరే ఇప్పుడే హీరో గ‌మ్య‌స్థాన‌మైంది. ప్ర‌ముఖ నటిని కిడ్నాప్ చేయించి.. ఆమెపై లైంగిక దాడిచేయించిన వైనం సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ఆధారాల‌తో స‌హా హీరో దిలీప్ హ‌స్తం ఉంద‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌మైన ఆధారాలు ల‌భించ‌టంతో పోలీసులు ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌టం తెలిసిందే.

స‌ద‌రు హీరోయిన్ పై లైంగిక‌దాడి ఉదంతంలో దిలీప్ హ‌స్తం ఉంద‌న్న నిజం బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. ఆయ‌న అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌న‌ప్రియ నేత‌గా అభిమానంగా పిలుచుకునే దిలీప్‌ను ఇప్పుడు అస‌హ్యించుకుంటున్నారు. ఇలాంటి వాడినా తాము ఇంత‌కాలం అంత‌గా అభిమానించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా.. ఆయ‌న‌కు చెందిన రెస్టారెంట్‌పై ప‌లువురు దాడి చేసి విధ్వంసం సృష్టించారు.

త‌న వ్యాపారాల‌పై దాడి జ‌రుగుతున్న వైనంపై ఆయ‌న పోలీసుల ర‌క్ష‌ణ కోరారు. నిన్న‌టి వ‌ర‌కూ దిలీప్‌కు అండ‌గా నిలిచిన మ‌ల‌యాళ చిత్ర‌ప‌రిశ్ర‌మ సైతం ఇప్పుడు ఆయ‌న‌పై విరుచుకుప‌డుతోంది. బాధిత న‌టికి అండ‌గా ఉండాల‌ని మ‌ల‌యాళం మూవీ ఆర్టిస్ట్స్ సంఘం (అమ్మ‌) తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. మొత్తానికి త‌న చివ‌రి సూప‌ర్ హిట్ సినిమా పేరే.. త‌న భ‌విష్య‌త్తు అన్న విష‌యాన్ని దిలీప్ ఎప్పుడూ ఊహించి ఉండ‌రేమో?