Begin typing your search above and press return to search.
దిల్ రాజు గారి సతీమణి.. శ్రీమతి వైఘా రెడ్డి
By: Tupaki Desk | 11 May 2020 8:00 AMస్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో వివాహం చేసుకోనున్నారని కొద్ది రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. రాజుగారి మొదటి భార్య అనిత కొంతకాలం క్రితం ఈ లోకాన్ని విడిపోవడంతో ఒంటరితనం తో ఇబ్బంది పడుతున్నానని రాజు గారు కూడా తన మనసులోని బాధను ఓపెన్ గా చెప్పారు. ఈమధ్య కొత్త జీవితం ప్రారంభించబోతున్నాని హింట్ కూడా ఇవ్వడంతో త్వరలోనే వివాహం ఉంటుందని అందరూ ఊహించారు. నిన్న అతి కొద్ది మంది బంధువులు సన్నిహితుల సమక్షంలో రాజు గారి వివాహం జరిగింది.
ఇక వధువు ఎవరనే విషయంలో మొదట స్పష్టత లేనప్పటికీ ఇప్పుడు వివరాలు బయటకు వచ్చాయి. రాజుగారి టీం స్వయంగా ఈ వివరాలను వెల్లడించారు. రాజుగారి భార్య అసలు పేరు తేజస్విని అయితే వివాహం తరువాత వైఘా రెడ్డి అని పేరు మార్చుకున్నారని వెల్లడించారు. వైఘా రెడ్డి గతంలో ఎయిర్ హోస్టెస్ గా పని చేశారని సమాచారం.
కరోనా వైరస్ లాక్ డౌన్ నిబంధనల కారణంగా అతి తక్కువ మంది మాత్రమే వివాహానికి హాజరు అయ్యారని సమాచారం. ఫిల్మ్ ఇండస్ట్రీలోని సన్నిహితులు.. శ్రేయోభిలాషులు.. అభిమానులు రాజు గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు.