Begin typing your search above and press return to search.
సతీ సమేతుడై శ్రీవారి సేవలో నిర్మాత దిల్ రాజు
By: Tupaki Desk | 13 Oct 2020 9:30 AM ISTటాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్- తేజస్విని దంపతులు మంగళవారం తిరుమలేశుని దర్శించుకున్నారు. వీఐపీ కేటగిరీలో ఈ జంట వెంకన్న సామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశ్వీరచనాలు అందించారు.
మేలో ఈ జంట వివాహం అయ్యింది. అప్పట్లో ఓసారి శ్రీవెంకటేశుని సందర్శించారు. ఇప్పుడు రెండోసారి దర్శనకార్యక్రమం పూర్తయింది. వెంకటేశుని దర్శనానంతరం గుడి వెలుపలికి వచ్చాక తిరుమల మీడియా ఆయన వెంట పడింది. అయితే మీడియాతో దిల్ రాజు ముచ్చటించేందుకు నిరాకరించారు.
ఇక దిల్ రాజు 2003లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి దిగ్విజయంగా ఈ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఏ శుభకార్యం అయినా... సినిమాలు రిలీజైనా వెంకన్న సన్నిధానానికి వెళ్లడం ఆయనకు అలవాటు. 2020 లాక్ డౌన్ లో ఆయనకు కావాల్సినంత తీరిక సమయం లభించింది. సతీమణితో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపారు. తదుపరి పలు భారీ చిత్రాల్ని రిలీజ్ చేయాల్సి ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న `వకీల్ సాబ్` చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే.