Begin typing your search above and press return to search.

వారసుడు.. ఆ మచ్చ పోయేలా దిల్ రాజు ప్లాన్

By:  Tupaki Desk   |   13 Nov 2022 7:06 AM GMT
వారసుడు.. ఆ మచ్చ పోయేలా దిల్ రాజు ప్లాన్
X
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో తన మార్కెట్ను అంతకంతకు పెంచుకుంటూనే ఉన్నాడు. ముఖ్యంగా అతను తెలుగులో కూడా కొంత డిమాండ్ ఏర్పరచుకోవడం విశేషం. ఇంతవరకు విజయ్ తెలుగులో ఏ సినిమాకు కూడా పెద్దగా ప్రమోషన్ చేసింది లేదు. తమిళంలో కూడా అతను ప్రమోషన్ చేసేది చాలా తక్కువ. ఏదో ఈవెంట్స్ తో అలా ముందుకు సాగుతున్నాడు కానీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువే.

ఇక విజయ్ వారసుడు సినిమా విషయానికి వస్తే మాత్రం ప్రమోషన్స్ విషయంలో కాస్త ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అసలే ఇది దిల్ రాజు సినిమా కాబట్టి భారీ స్థాయిలో 90 కోట్లకు పైగా పారితోషకం కూడా ఇచ్చాడు కావున ప్రమోషన్ చేయాల్సిందే అనే కండిషన్ కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక విజయ్ ఈసారి డైరెక్ట్ గా తెలుగు ఆడియన్స్ ముందుకు ప్రమోషన్స్ కోసం రాబోతున్నాడు.

తమిళంలో అయితే మరికొన్ని రోజుల్లో ఒక భారీ ఈవెంట్ తో వారసుడు సినిమా అసలైన ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇక తెలుగులో కూడా అదే తరహాలో ఒక బిగ్ ఈవెంట్ ప్లాన్ చేయాలని రాజుగారు డిసైడ్ అయ్యారు. ఇక దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా విజయ్ తో ఆ విషయం గురించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేకంగా కొంత తెలుగుపై అవగాహన కూడా తీసుకువచ్చే విధంగా దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు.

విజయ్ తెలుగులో మాట్లాడే తెలుగు ఆడియోన్స్ ను పూర్తిస్థాయిలో తన వైపు తిప్పుకోవాలని అనుకుంటున్నాడు. సినిమాలో ఉండే కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ కూడా తెలుగు ఈవెంట్ లో చెప్పాలని ఆలోచిస్తున్నాడట. అందుకోసం ప్రత్యేకంగా కొంత శిక్షణ కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వంశీ పైడిపల్లి అయితే గతంలో ఇది కంప్లీట్ గా తమిళ సినిమా అని కామెంట్ చేశాడు. ఇక ఆ విషయంలో దిల్ రాజు కాస్త వెబ్సైట్ అయ్యాడు. అందుకే మళ్ళీ ఆ మచ్చ పడకూడదు అని వారసుడు సినిమాను తెలుగు ఆడియోన్స్ కూడా దగ్గరికి తీసుకునే విధంగా ఉండాలి అని ఆలోచనతోనే ఈ తరహా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. మరి వారసుడు తెలుగులో ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.