Begin typing your search above and press return to search.

మైత్రి వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు రాజుగారి ప్రయత్నాలు

By:  Tupaki Desk   |   31 March 2021 4:30 AM GMT
మైత్రి వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు రాజుగారి ప్రయత్నాలు
X
టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ వారు భారీ ఎత్తున సినిమాలను ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో దాదాపు అందరు స్టార్‌ హీరోలకు అడ్వాన్స్‌ లు ఇచ్చేసి బుక్‌ చేసిన మైత్రి మూవీస్ వారు తమిళం మరియు హిందీల్లో కూడా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. మైత్రి వారితో పోటీ పడేందుకు టాలీవుడ్‌ మరో అగ్ర నిర్మాత దిల్‌ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మరియు తమిళ దర్శకుడు శంకర్‌ ల కాంబోలో మెగా ప్రాజెక్ట్‌ ను ప్రకటించాడు. మరో వైపు పవన్‌ తో చేసిన భారీ మూవీ వకీల్‌ సాబ్‌ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక బాలీవుడ్‌ లో జెర్సీ సినిమా తో దిల్‌ రాజు అదృష్టంను పరీక్షించుకుంటున్న విషయం తెల్సిందే.

ఇటీవలే కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమా ను కన్ఫర్మ్‌ చేసుకున్నాడు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమాలు నిర్మించేందుకు బాలీవుడ్‌ నుండి కోలీవుడ్‌ వరకు పదుల సంఖ్యలో నిర్మాతలు అడ్వాన్స్‌ లు పట్టుకుని తిరుగుతున్నారు. అలాంటి ప్రశాంత్‌ నీల్‌ ను ఏకంగా రెండు సినిమా లకు గాను దిల్‌ రాజు బుక్‌ చేసుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌ తో సినిమా తో పాటు తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ తో కూడా ప్రశాంత్‌ నీల్‌ మూవీ ఉంటుందని అంటున్నారు. దిల్‌ రాజు ఇటీవల శంకర్‌ తో సినిమాను నిర్మించడం వల్ల కోలీవుడ్‌ లో మంచి క్రేజ్‌ దక్కింది. అందుకే విజయ్‌ డేట్లు ఈజీగా లభించాయని అంటున్నారు.

విజయ్‌ మరియు ప్రశాంత్‌ నీల్‌ కాంబో మూవీని దిల్‌ రాజు సెట్‌ చేశాడట. మొత్తానికి మైత్రి వారిని మించి అన్నట్లుగా వరుసగా భారీ చిత్రాలను సెట్‌ చేస్తున్న దిల్‌ రాజు అందరికి ఆశ్చర్యంను కలిగిస్తున్నాడు. రాబోయే రెండు మూడు ఏళ్లలో దిల్‌ రాజు బ్యానర్‌ నుండి రాబోతున్న సినిమాలు మొత్తం కూడా పాన్‌ ఇండియా చిత్రాలే అంటున్నారు. ప్రశాంత్‌ నీల్‌ తో రెండు సినిమా లను దిల్‌ రాజు ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తాడా అనేది వేచి చూడాలి.