Begin typing your search above and press return to search.

OTT వార్: అల్లు బాస్ కి పోటీగా ఆయ‌నా?

By:  Tupaki Desk   |   1 Feb 2020 12:28 PM IST
OTT వార్: అల్లు బాస్ కి పోటీగా ఆయ‌నా?
X
ఫ్యూచ‌ర్ సినిమా డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్). ఇంట్లోనే కుటుంబ స‌మేతంగా సినిమా వీక్ష‌ణ‌. అందుకు ఇంకెంతో దూరంలో లేం. అంత‌కుముందే ఓటీటీ రంగం ఊపేస్తోంది. ఇప్ప‌టికే డిజిటల్ స్ట్రీమింగ్ బిజినెస్ పీక్స్ కి చేరుకుంది. నెట్ ప్లిక్స్..అమెజాన్ ప్రైమ్ లాంటి కార్పొరెట్ సంస్థ‌లు థియేట‌ర్ల‌లో రిలీజైన‌ సినిమాని కేవ‌లం 30 రోజుల్లొనే త‌మ ప్లాట్ ఫామ్ మీద‌కు తెచ్చేస్తుండ‌డం కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తావిచ్చింది. ఇది దేశీయ కార్పొరెట్ లోనూ ఉత్సాహం నింపుతోంది.

ఇలాంటి బిజినెస్ ల వాస‌న ప‌సిగ‌ట్ట‌డం లో ఎంతో అడ్వాన్స్ డ్ గా ఆలోచించే మెగా నిర్మాత అల్లు అర‌వింద్ కూడా ఆహా పేరుతో ఓటీటీలో ప్ర‌వేశించి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసారు. త‌మ ఫ్యామ‌లీ హీరోలే డ‌జ‌ను కు పైగా ఉండ‌టం తో!.. స‌ద‌రు స్టార్ల సినిమాల‌ను తన ప్లాట్ ఫాం ద్వారానే అందిస్తున్నారు. ఇటీవ‌లే ఓటీటీ వేదిక హాయ్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఇది యాప్ ద్వారా ఉచితంగానే అందుబాటులో ఉంది. ఇందులో ఇత‌ర హీరోలు..బ‌య‌ట ప్రొడ‌క్ష‌న్ లో నిర్మాణం జ‌రిగిన సినిమాల‌ను కూడా కొనుగోలు చేయ‌డం మొద‌లు పెడుతున్నారట‌. మొత్తానికి త‌నదైన‌ బిజినెస్ స్ట్రాట‌జీ తో మ‌రోసారి ఎంత అడ్వాన్స్ గా ఉన్నారో? అల్లు బాస్ చెప్ప‌క‌నే చెబుతున్నారు.

ఈ నేప‌థ్యం లో తాజాగా అరవింద్ మార్గంలోనే స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజ్ కూడా న‌డ‌వాల‌నుకుంటున్నార‌ట‌. ఆయ‌న కూడా ఓటీటీలోకి అడుగు పెట్టాల‌ని స‌న్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. ఎలా లేద‌న్నా దిల్ రాజు ఏడాదికి మూడు నుంచి నాలుగు స్టార్ హీరోల సినిమాలు నిర్మిస్తున్నారు. అవిగాక బ‌య‌ట సినిమా రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యం లో దిల్ రాజు కూడా ఓటీటీ స్టార్ట్ చేస్తే త‌న సినిమాల‌కు ఉప‌ యుక్తం గా ఉంటుంద‌ని భావిస్తున్నారుట‌.

అయితే ఈ ఆలోచ‌న ఇంకా ప్రాథ‌మిక‌ స్థాయిలోనే ఉంద‌ని స‌మాచారం. దానికి సంబంధించిన వివ‌రాలు అన్నింటిని త‌న స్నేహితుడు.. నిర్మాత అల్లు అర‌వింద్ ని రాజుగారు ఇప్ప‌టికే అడిగి తెలుసుకుంటున్నారుట‌. అయితే దిల్ రాజు నిజంగా..సోంతంగా ఓటీటీ రంగంలోకి దిగితే ఇద్ద‌రి మ‌ధ్య వార్ మొద‌లైన‌ట్టే. స్నేహితులు ఇద్ద‌రి మ‌ధ్యా బిజినెస్ ప‌రంగా పోటీ పెరుగుతుందని అంచ‌నా వేస్తున్నారు. రాజుగారు కూడా తెలివైన బిజినెస్ మ్యాన్ కాబ‌ట్టి ఓటీటీ ని జ‌నాల్లోకి ఎలా తీసుకెళ్లాలో అరవింద్ త‌ర‌హాలోనే తెలివైన విధానాన్ని ఫాలో చేస్తార‌నే భావిస్తున్నారు.