Begin typing your search above and press return to search.

చిన్న సినిమాలకొచ్చేసిన దిల్ రాజు

By:  Tupaki Desk   |   9 Sept 2019 10:54 AM IST
చిన్న సినిమాలకొచ్చేసిన దిల్ రాజు
X
డిస్ట్రిబ్యూటర్ గా సినీ ప్రయాణం మొదలుపెట్టి మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకునే రేంజ్ లో సక్సెస్ అందుకున్న దిల్ రాజుకు ఈ మధ్య కాలంలో టైం అట్టే వర్క్ అవుట్ కావడం లేదు. ఎంతో నమ్మి కొన్న సినిమాలు నిలువునా ముంచేయడం ఆడవు అనుకుని వదిలేసినవి బ్లాక్ బస్టర్ కావడం ఆయనకు సైతం అంతు చిక్కడం లేదని ఫిలిం నగర్ టాక్. జడ్జ్ మెంట్ విషయంలో గురి తప్పరని పేరు తెచ్చుకున్న ఆయనకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి రావడం విచిత్రమే.

మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమాలు చేస్తున్నా తాను సోలో ప్రొడ్యూసర్ గా రిస్క్ చేయడం లేదు. ఈ క్రమంలో చిన్న సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా నిర్మాణంలో ఉన్న ఇద్దరి లోకం ఒకటే కూడా ఇదే క్యాటగిరీలోకి వస్తుంది . ఇదిలా ఉండగా నటుడు కం రవిబాబు తీసిన ఆవిరి సినిమాను దిల్ రాజు రిలీజ్ తో పాటు పంపిణి హక్కులు తీసుకోబోతున్నట్టుగా వినికిడి. అధికారిక ప్రకటన రేపో మాపో రావొచ్చు.

నిజానికి ఆవిరి రవిబాబు ఇంతకు ముందు ప్లాన్ చేసుకున్నదే. అదిగో దారుణమైన డిజాస్టర్ గా మిగలడంతో పాటు అంతకు ముందు అవును 2 కూడా నిరాశ పరచడంతో ఇతని మీద పెట్టుబడికి నిర్మాతలు కాస్త జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో దిల్ రాజు రవిబాబు సినిమాను టేకప్ చేయాలని నిర్ణయించుకోవడం ఆలోచించాల్సిన విషయమే. అల్లు అర్జున్ తో తలపెట్టిన ఐకాన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా ఇంకా క్లారిటీ రావడం లేదు. మొత్తానికైతే దిల్ రాజు స్ట్రాటజీ మార్చుకుని చిన్న సినిమాల వైపే ఎక్కువ ఫోకస్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది