Begin typing your search above and press return to search.
ఆ డీల్ వరుణ్ సంతకం పెట్టేస్తాడా??
By: Tupaki Desk | 13 May 2016 12:10 PM ISTఈ మధ్య కాలంలో చాలామంది యంగ్ హీరోలతో డీల్ చేసుకుందామని ప్రయత్నిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. మొన్ననే సుప్రీమ్ సినిమాతో ఏకంగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలసి హ్యాట్రిక్ హిట్టు కొట్టేశాడు. అయితే మూడు సినిమాల ప్యాకేజ్ డీల్ సైన్ చేసిన సాయిదరమ్ మళ్లీ ఆ డీల్ ను రిపీట్ చేయలేదు. అందుకే మరో మెగా హీరోపై కన్నేశాడు రాజు గారు.
ఫిలిం నగర్‌లో వినిపిస్తున్న వివరాల ప్రకారం.. అసలు శేఖర్ కమ్మలు కథను వరుణ్ దగ్గరకు తీసుకెళ్ళకముందే.. మెగా ప్రిన్స్ తో 3 సినిమాలు సంతకం చేయాలని ఫిక్సయ్యాడట రాజు. అతనిలో ఉన్న పొటెన్షియల్ ను గుర్తించి.. 3-4 సినిమాలు చేద్దాం.. ఫ్లాట్ గా ఎంత రెమ్యూనరేషన్ కావాలో చెప్పు అంటూ బేరసారాలు మొదలెట్టేశాడట. కాని శేఖర్ కథకు ఓకె చెప్పిన వరుణ్.. ఇంతవరకు దిల్ రాజు డీల్ మీద స్పందించలేదు. మరి వరుణ్ ఇంతకీ డీల్ సెట్ చేసుకుంటాడా లేకపోతే తన కజిన్ లా దిల్ రాజుకు ఎందుకు కమిటైపోవడం అని పక్కకు తప్పుకుంటాడా?
ఇకపోతే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో.. మెగా క్యాంపు కాకుండా బయట ఎవరితోనైనా కూడా ఇలాంటి డీల్ చేద్దామని చూసినా.. రవితేజ అండ్ నాని వంటి హీరోలతో డీల్స్ వర్కవుట్ కాలేదు. కాకపోతే నాని మాత్రం ఒక సినిమా చేద్దామని ముందు ఓకె చెప్పాడట.