Begin typing your search above and press return to search.

ఏది జరిగినా దిల్ రాజు అందరికి కనిపిస్తాడు..!

By:  Tupaki Desk   |   29 Dec 2022 7:09 PM IST
ఏది జరిగినా దిల్ రాజు అందరికి కనిపిస్తాడు..!
X
నిర్మాతగా ఎంత సక్సెస్ అయినా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం కొన్ని లెక్కలు వేసుకుంటాడు. తన సినిమాతో పాటే రిలీజ్ అయ్యే సినిమాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ సినిమా మీద తన ఇష్టాన్ని చూపిస్తుంటాడు. సినిమా మీద అంత ప్యాషన్ తో ఉండే దిల్ రాజుపై ఈమధ్య కొన్ని కాంట్రవర్సీలు హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా చిన్న సినిమాలను దిల్ రాజు తొక్కేస్తున్నాడన్నది హాట్ టాపిక్. కార్తికేయ 2 సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ కి దిల్ రాజు ప్రధాన కారణం అన్నట్టు.. ఆ టైం లో హీరో నిఖిల్ కన్నీళ్లకు కూడా దిల్ రాజే కారణం అన్నట్టు మీడియా ప్రొజెక్ట్ చేసింది.

ఆ టైం లో తన సొంత సినిమా థ్యాంక్ యు రిలీజ్ ఉన్న కారణంగా దిల్ రాజు మూడు సినిమాల నిర్మాతలతో మాట్లాడి కార్తికేయ 2 ని వాయిదా వేసుకోమని అన్నారట. అయితే అది రిక్వెస్ట్ మాత్రమే కానీ తాను బలవంతం చేయలేదని అన్నారు దిల్ రాజు. తన మీద కావాలని ఇలాంటి నెగటివ్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. అంతేకాదు ఆమధ్య మహేష్ సినిమా వసూళ్ల విషయంపై కూడా తను ఏదో కామెంట్ చేశానని మహేష్ తన నెక్స్ట్ సినిమా దిల్ రాజుకి ఇవ్వొద్దని నిర్మాతలకు చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి.

వాటిపై కూడా దిల్ రాజు స్పందించారు. మహేష్ చాలా సెన్సిటివ్ అని.. ఆ టైం లో తనకు ఏది అనిపిస్తే అది అనేస్తాడు.. ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడని. తన సినిమా కలెక్షన్స్ విషయంలో తానేదో అన్నానని మహేష్ కి ఎవరో చెప్పడం దాని మీద అతను సీరియస్ అవడం లాంటివి జరిగాయని చూచాయగా చెప్పారు దిల్ రాజు. అయితే మహేష్ నెక్స్ట్ సినిమాకు నిర్మాతలకు తాను భారీ ఆఫర్ ఇస్తే తన సినిమా నాకు ఇవ్వకుండా ఉంటారా అని అన్నారు దిల్ రాజు.

పరిశ్రమ బాగుండాలని కోరుకునే వారిలో తాను ఒకడిని అని.. నిర్మాతగా ఎన్నో రిస్క్ లు చేశానని.. డిస్ట్రిబ్యూటర్ గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానని అన్నారు దిల్ రాజు. తన మీద కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని. తానేంటి అన్నది తన దర్శకులకు.. తన హీరోలకు తెలుసని అన్నారు దిల్ రాజు. మొత్తానికి దిల్ రాజు తన మీద ఉన్న చిన్న రిమార్క్ ని కూడా చెరిపేయాలనే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ జరిగేదో ఏమో కానీ అందరు దిల్ రాజునే టార్గెట్ చేయడం మాత్రం వాస్తవం అని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.