Begin typing your search above and press return to search.

దిల్ రాజు స్క్రాప్ మొత్తాన్ని వ‌దిలించుకున్నారా?

By:  Tupaki Desk   |   11 April 2020 10:45 AM IST
దిల్ రాజు స్క్రాప్ మొత్తాన్ని వ‌దిలించుకున్నారా?
X
లాక్ డౌన్ నేప‌థ్యంలో థియేట‌ర్లు బంద్ అయిన సంగ‌తి తెలిసిందే. ఒక‌వేళ తెరిచినా జ‌నం వెళ్లే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే బుల్లితెర స‌హా డిజిట‌ల్ కి ఆద‌ర‌ణ అమాంతం పెరిగింది. ముఖ్యంగా అమెజాన్.. నెట్ ప్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్ లే బెస్ట్ వినోద మాధ్య‌మాలుగా మారాయి. ఇండియాలో వినోద ప్రియుల నుంచి వ‌చ్చే ఆదాయం అంతా ఇప్పుడీ రెండు డిజిట‌ల్ స్ట్రీమింగ్ సంస్థ‌ల‌దే. పాత‌..కొత్త‌...హిట్..ప్లాప్ అనే తార‌త‌మ్యం లేకుండా ప్ర‌తి సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ లో ద‌ర్శ‌నిమిస్తున్నాయి. యాప్ ఓపెన్ చేస్తే చాలు ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ చూడ‌ని సినిమా టైటిల్స్ హోమ్ పేజ్ పై క‌నిపిస్తున్నాయి. కొత్త కొత్త ఆఫ‌ర్ల పేరుతో ఎర వేస్తూ వీక్ష‌కుల్నిపెంచుకుంటున్నాయి. ఆమెజాన్ ప్రైమ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత క‌నెక్టింగ్ గా ఉండ‌టంతో అంతా ఈ మాధ్య‌మంపైనే ఆధార‌ప‌డుతున్నారు.

తాజా స‌న్నివేశాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు తెలివిగా స‌ద్వినియోగం చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. లాక్ డౌన్ వేళ త‌న వ‌ద్ద ఉన్న స్క్రాప్ మొత్తాన్ని అమెజాన్ కి తోసేస్తున్నార‌ని స‌మాచారం. అంతేకాదు ఇప్ప‌టికే శాటిలైట్ రైట్స్ వేరే వాళ్ల‌కు ఉన్నా.. హిట్లు అని చెబుతూ యావ‌రేజ్ గా ఆడిన సినిమాల్ని...ప్లాప్ సినిమాల్ని అమెజాన్ ప్రైమ్ తో బిజినెస్ కుదుర్చుకున్నార‌ట‌. ఆ సినిమాల శాటిలైట్ రైట్స్ వేర్వేరు ఛాన‌ల్స్ లో ఉన్నా! వాళ్ల‌ను మ్యానేజ్ చేసుకుని అమెజాన్ తో బిజినెస్ చేయ‌డం ఆయ‌న‌కే చెల్లిందన్న టాక్ వినిపిస్తోంది. ఏదో ఒక‌టి చేసి లాక్ డౌన్ టైమ్ లోనూ సంపాదించ‌డం త‌న‌కే చెల్లింద‌ని రాజుగారు నిరూపిస్తున్నారు.

ఇక వీటిలో బ్లాక్ బ‌స్ట‌ర్లు.. హిట్లు ఉన్నా ఫ్లాపులు యావ‌రేజ్ లు.. చెత్త సినిమాలు ఉన్నాయి. ఇటీవ‌లే రిలీజైన‌ జాను సినిమా ఇప్పుడు ఆమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వ‌ర‌కూ క‌నిపించిన సినిమాలు ఒక్క‌సారిగా అమెజాన్ లో క‌నిపించేస‌రికి షాక్ అవ్వాల్సిన స‌న్నివేశం ఉంది మ‌రి. మొత్తానికి రాజుగారు ఏదో ఒక మాయ చేసి రాబ‌ట్టుకోవాల్సింది రాబ‌ట్టేస్తున్నార‌న్న‌మాట‌. లాక్ డౌన్ ప‌ర్య‌వ‌సానంతో సినిమాల నిర్మాణం.. ఎగ్జిబిష‌న్.. డిస్ట్రిబ్యూష‌న్ ఇలా అన్ని విధాలుగా లాక్ అయిపోయిన రాజుగారు ఇలా స‌రికొత్త త‌రుణోపాయంతో ఆర్జించ‌డం ఇంట్రెస్టింగ్.