Begin typing your search above and press return to search.

నితిన్ హీరో ఎలా అయ్యాడో సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన దిల్ రాజు

By:  Tupaki Desk   |   9 July 2022 11:30 PM GMT
నితిన్ హీరో ఎలా అయ్యాడో సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన దిల్ రాజు
X
హీరో నితిన్ న‌టిస్తున్న లేటెస్ట్ హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `మాచెర్ల నియోజ‌క వ‌ర్గం`. ఈ మూవీ ద్వారా ఎడిట‌ర్ ఎం.ఎస్. రాజ‌శేఖ‌ర రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కృతిశెట్టి, కేథ‌రిన్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై ఎన్ . సుధాక‌ర్ రెడ్డి, నిఖితారెడ్డి అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఆగ‌స్టు 12న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

రిలీజ్ స‌మీపిస్తున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ ని మొద‌లు పెట్టింది. తాజాగా ఫ‌స్ట్  ఎటాక్ పేరుతో టీజ‌ర్‌ని విడుద‌ల చేసి సినిమాపై హైప్ ని క్రియేట్ చేసింది. ఈ మూవీలో నితిన్ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌లెక్ట‌ర్ గా న‌టిస్తున్నాడు. అంతే కాకుండా ఈ పాత్ర కోసం స‌రికొత్త మేకోవ‌ర్ తో లైట్ గ‌డ్డం.. మెలితిప్పిన మీసం క‌ట్టుతో మ్యాన్లీగా ప‌వ‌ర్ ఫుల్ లుక్ లోకి మార‌పోయాడు. ఈ మూవీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా చిల్ మారో అంటూ సాగే పెప్పీ నంబ‌ర్ ని రిలీజ్ చేశారు.

కేథ‌రిన్ తో క‌లిసి నితిన్ స్టైలిష్‌ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టాడు. తాజాగా `రారా రెడ్డి.. అంటూ సాగే స్పెష‌ల్ ఐట‌మ్ నంబ‌ర్ ని శ‌నివారం విడుద‌ల చేశారు. మ‌హతి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందించ‌గా ఈ పాట‌కు క్రేజీ రైట‌ర్ కాస‌ర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. లిప్సిక ఆల‌పించిన ఈ పాట‌కు నితిన్ తో క‌లిసి అంజ‌లి గ్లామ‌ర్ ఒలికిస్తూ మాసీవ్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. శ్రీ‌కాకుళంలోని ఎన్టీఆర్ స్కూల్ గ్రౌండ్ లో రిలీజ్ కావాల్సిన ఈ పాట‌ని భారీ వ‌ర్షాల కార‌ణంగా హైద‌రాబాద్ లోని ఏఎంబీ మాల్ లో రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న దిల్ రాజు ఈ సంద‌ర్భంగా హీరో నితిన్ హీరో ఎలా అయ్యాడో సీక్రెట్ బ‌య‌ట‌పెట్టాడు.

మీ అంద‌రి మ‌ధ్య‌లో ఈ పాట‌ని విడుద‌ల చేయ‌డం నాకు, చిత్ర బృందానికి చాలా స్పెష‌ల్‌. ఎందుకంటే నితిన్ తో నా అసోసియేష‌న్ 20 ఏళ్లు. నితిన్ హీరో అయి 20 ఏళ్ల‌వుతోంది. నేను నిర్మాత‌గా మారి కూడా దాదాపుగా 20 ఏళ్లు కావ‌స్తోంది. 19 ఏళ్లు పూర్త‌యి 20 ఏళ్ల‌లోకి అడుగుపెట్టాం. దీని వెన‌క బిగ్ బ్యాక్ స్టోరీ వుంది. నితిన్ వాళ్లు ఫాద‌ర్‌, నేను వ్యాపార భాగ‌స్వాములం. ఇద్ద‌రం క‌లిసి ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా `తొలిప్రేమ‌`ని నైజాంలో రిలీజ్ చేశాం. ఆ స‌మ‌యంలో నేను డైలీ థియేట‌ర్ కు వెళ్లి సినిమాలు చూస్తుండే వాడిని..నితిన్ అప్పుడు కాలేజీ స్టూడెంట్. కాలేజీకి డుమ్మాకొట్టి సినిమాలు చూస్తుండేవాడు. అలా సినిమాపై నితిన్ కు ఓ పాష‌న్ ఏర్ప‌డింది.

ఆ త‌రువాత నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి.. తేజ రూపొందించిన `నువ్వు నేను` మూవీని నైజాంలో రిలీజ్ చేశారు. ఆ స‌మ‌యంలో తేజ‌గారు నితిన్ ని చూసి `జ‌యం`తో హీరోని చేశారు. చాలా యాక్సిడెంట‌ల్ గా నితిన్ హీరో అయ్యాడు` అంటూ అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టాడు దిల్ రాజు.

ల‌క్కీగా హీరో అయ్యాడ‌ని చెప్పిన దిల్‌రాజు 20 ఏళ్ల జ‌ర్నీలో క‌ష్టాలు వ‌చ్చినా స‌క్సెస్ ఫుల్ గా హీరోగా 20 ఏళ్ల జ‌ర్నీని ఇండ‌స్ట్రీలో పూర్తి చేసుకున్న నితిన్ కు కంగ్రాట్స్ అని తెలిపారు. ఇలా ఇర‌వైఏళ్ల జ‌ర్నీని పూర్తి చేసుకోవ‌డం నాట్ ఏ జోక్ అంటూ నితిన్‌ని అభినందించారు. తెలుగు సినిమా హీరోల మ‌ధ్య బిగ్ పోటీ వుంది. ఇండియాలో వున్న ఇండ‌స్ట్రీల్లో అత్య‌ధిక శాతం హీరోలున్న ఇండ‌స్ట్రీ మ‌న‌దే. 15 మంది హీరోలున్న మ‌న ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఫుల్ గా నిల‌బ‌డ‌టం అనేది గ్రేట్ ` అంటూ నితిన్‌ని అభినందించారు.