Begin typing your search above and press return to search.

విజయ్ ను లేపుతున్న దిల్ రాజు?

By:  Tupaki Desk   |   21 Jun 2022 9:51 AM GMT
విజయ్ ను లేపుతున్న దిల్ రాజు?
X
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న విజయ్ తెలుగులో మాత్రం కాస్త ఆలస్యంగానే మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఒకప్పుడు రజినీకాంత్ విక్రమ సూర్య కమల్ హాసన్ కార్తి విశాల్ ఇలా అందరూ కూడా వరుసగా తెలుగులో ప్రమోషన్స్ చేసి మరి సినిమాలు విడుదల చేస్తూ వచ్చారు.

విజయ్ మాత్రం కేవలం తన సొంత భాషపేనే ఫోకస్ పెడుతూ వచ్చాడు. ఇక తుపాకి నుంచి మాత్రం తెలుగులో అతనికి ఫాలోయింగ్ పెరిగింది అనే చెప్పాలి.

ఇక మాస్టర్ సినిమాకు వచ్చేసరికి అతని మార్కెట్ కూడా 10 కోట్లు దాటింది. బీస్ట్ సినిమాకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. కానీ విజయ్ తెలుగులో పెద్దగా ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఇక ఇప్పుడు అతను దిల్ రాజు ప్రొడక్షన్లో 66 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కమర్షియల్ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతానికైతే పెద్దగా హైప్ ఐతే క్రియేట్ అవ్వలేదు.

సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం సోషల్ మీడియాలో బాగానే వదులుతున్నారు కానీ తెలుగు ఆడియెన్స్ నుంచి మాత్రం పెద్దగా రెస్పాన్స్ అయితే రావడం లేదు. అయితే విజయ్ కు 90 కోట్లకు పైగా పారితోషికం ఇస్తున్న దిల్ రాజు ఆ సినిమాకోసం బడ్జెట్ కూడా ఎక్కువగా పెడుతున్నాడు కాబట్టి అతని సినిమా తెలుగులో కూడా సక్సెస్ అవ్వాల్సిందే.

ఇక అతన్ని ప్రమోట్ చేసేందుకు కూడా బాగానే ప్రయత్నం చేస్తున్నాడు. బుధవారం రోజు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రత్యేకంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ షో వేయబోతున్నారు. దిల్ రాజు సెంటిమెంట్ గా భావించే సుదర్శన్ 35 ఎంఎం లో తెలుగులో విజయ్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా తుపాకీ షోను ప్రదర్శిస్తున్నారు.

విజయ్ కు తెలుగులో ప్రత్యేకంగా ఫ్యాన్ పోలింగ్ అంటూ పెద్దగా ఏమీ లేదు. అతని సినిమా వస్తే మాత్రం ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా చూడడానికి కొంత ఆసక్తిని చూపిస్తారు. ఇక విజయ్ ను మాత్రం ఏదో ఒక విధంగా తెలుగులో లేపేందుకు దిల్ రాజు ప్రయత్నం చేస్తూ తన తదుపరి సినిమాకు బిజినెస్ చేసుకోవాలని బాగానే ప్రణాళికలు చేస్తున్నాడు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.