Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్‌తో దిల్ రాజు మళ్లీ..
By: Tupaki Desk | 16 July 2015 10:40 AM ISTమొదట్లో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు తీసిన దిల్ రాజు.. ఆ తర్వాత వరుసగా భారీ సినిమాలు తీశాడు. ఐతే ఈ మధ్య మళ్లీ పాత దారిలోకి వెళ్లిపోయాడు. ఎవడు తర్వాత స్టార్స్‌తో సినిమా తీయని దిల్ రాజు.. మళ్లీ వచ్చే ఏడాది రూటు మార్చబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా నిర్మించబోతున్నాడు. మిర్చి లాంటి సూపర్ హిట్‌తో దర్శకుడిగా పరిచయమై.. మహేష్‌తో ‘శ్రీమంతుడు’ తీసిన కొరటాల శివ డైరెక్షన్లో ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయ్యాక 2016 జనవరిలో ఈ ముగ్గురి కాంబినేషన్ తెరపైకి వస్తుంది.
ఎన్టీఆర్‌తో దిల్ రాజు ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. అవి మిశ్రమ ఫలితాల్నిచ్చాయి. తొలి సినిమా ‘బృందావనం’ సూపర్ హిట్టవగా.. రామయ్యా వస్తావయ్య డిజాస్టర్‌గా మిగిలింది. దిల్ రాజు కెరీర్లోనే ఇది ఊహించని శరాఘాతం ఆ ఫ్లాప్ నుంచి కోలుకోవడానికి రాజుకు చాలా కాలమే పట్టింది. కొరటాల శివ ‘శ్రీమంతుడు’ షూటింగ్‌లో ఉండగానే ఎన్టీఆర్‌కు ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. మరి దిల్ రాజును ప్రాజెక్టులోకి ఎవరు తెచ్చారో తెలియదు కానీ.. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఎన్టీఆర్-కొరటాల సినిమాను నిర్మించబోతున్నట్లు వెల్లడించాడు. శ్రీమంతుడు వచ్చే నెల 7న విడుదల కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఖాళీ అవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి.. ఆలోపు స్క్రిప్టు పూర్తి చేస్తాడు కొరటాల.