Begin typing your search above and press return to search.
ఆ సినిమా కోసం దిల్ రాజు స్పెషల్ ప్లాన్
By: Tupaki Desk | 26 Aug 2017 4:42 PM ISTమొన్న ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ముందు రోజు రాత్రి నుంచే స్పెషల్ ప్రివ్యూ షోలు వేస్తుంటే ఏంటి వీళ్ల ధైర్యం అనుకున్నారంతా. సినిమా మీద ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఇలా చేయరు. వాళ్ల కాన్ఫిడెన్స్ ఫలితాన్నిచ్చింది. ముందు రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. గత ఏడాది ‘పెళ్లిచూపులు’ సినిమాకైతే విడుదలకు వారం ముందు నుంచే స్పెషల్ ప్రివ్యూలు వేశారు. సినీ ప్రముఖుల్ని.. మీడియా వాళ్లను పిలిచి వరుసగా రోజూ ప్రివ్యూలు వేశారు. దాని వల్లే ముందే పాజిటివ్ టాక్ జనాల్లోకి వెళ్లిపోయింది. రానా సినిమా ‘ఘాజీ’కి కూడా రెండు రోజుల ముందే ప్రివ్యూ వేయడం కలిసొచ్చింది. ఇప్పుడు మరో చిన్న సినిమాకు ఇలా ముందస్తు ప్రివ్యూలు వేయబోతున్నారు. ఆ సినిమానే.. వెళ్లిపోమాకే.
యాకూబ్ మహ్మద్ అలీ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ‘వెళ్లిపోమాకే’ సినిమాను దిల్ రాజు టేకప్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 1న బాలయ్య సినిమా ‘పైసా వసూల్’ భారీ అంచనాల మధ్య విడుదలవుతున్నా సరే.. మరుసటి రోజు ధైర్యంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు దిల్ రాజు. ఐతే ముందుగా ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు విడుదలకు ఐదు రోజుల ముందే హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లోని ప్రివ్యూ థియేటర్లో ప్రివ్యూలు వేస్తున్నాడు రాజు. మామూలుగా మీడియా వాళ్లకో సినిమా వాళ్లకో ప్రివ్యూలు వేస్తారు. కానీ దిల్ రాజు మాత్రం సామాన్య ప్రేక్షకులూ వచ్చి సినిమా చూడొచ్చంటున్నాడు. ఎంతమంది వస్తే అంతమందికీ ప్రివ్యూలు వేయాలని నిర్ణయించాడు. శనివారం సాయంత్రం 6 గంటలకు తొలి ప్రివ్యూ వేయబోతున్నారు. జనాల స్పందనను బట్టి మరిన్ని ప్రివ్యూలు వేస్తారట. ఈ ప్రివ్యూల ద్వారా సినిమా గురించి చర్చ జరిగితే ప్రమోషన్ కు పనికొస్తుందని రాజు భావిస్తున్నాడు.