Begin typing your search above and press return to search.

దిల్ రాజుని నిలబెట్టిన పవన్ సినిమా..!

By:  Tupaki Desk   |   30 Nov 2022 5:30 AM GMT
దిల్ రాజుని నిలబెట్టిన పవన్ సినిమా..!
X
ఆటో మొబైల్ బిజినెస్ చేస్తూ సడెన్ గా డిస్ట్రిబ్యూటర్ గా మారారు దిల్ రాజు. బిజినెస్ మ్యాన్ గా ఉన్న దిల్ రాజు ముందు డిస్ట్రిబ్యూటర్ గా టర్న్ తీసుకుని.. ఆ తర్వాత నిర్మాతగా మారి అద్భుతాలు సృష్టించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు తన కెరీర్ స్టార్టింగ్ డేస్ ను గుర్తు చేసుకున్నారు. తన భార్య వాళ్ల బాబాయి డిస్ట్రిబ్యూషన్ రంగలో ఉన్నారని. ఒకసారి ఆయనతో తనకున్న ఇంట్రెస్ట్ ని చెప్పగా ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ ఉందని చెప్పి ఇప్పించారని. డిస్ట్రిబ్యూటర్ గా మొదటి మూడు నాలుగు సినిమాలు తనకి భారీ లాసులు వచ్చేలా చేశాయని అన్నారు దిల్ రాజు. తొలి నాలుగేళ్లలో కోటి దాకా నష్టపోయామని. ఆ టైం లో అది భారీ మొత్తమని అన్నారు దిల్ రాజు.

ఆ తర్వాత ఒక కన్నడ సినిమా చూసి రీమేక్ చేయమని సలహా ఇవ్వగా దాని డిస్టిబ్యూషన్ చేస్తే అది లాభాలు తెచ్చిందని. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాకు 70 లక్షలు పెట్టి నైజాం రైట్స్ తీసుకోగా ఆ సినిమా 2.8 కోట్లు వసూలు చేసిందని.. ఆ సినిమా తమకు భారీ లాభాలు తెచ్చి పెట్టిందని అన్నారు దిల్ రాజు.

ఫస్ట్ డే ఫస్ట్ షో పడే వరకు ఒక సినిమా హిట్టా ఫట్టా అని చెప్పలేం అందుకే సొంతంగా సినిమాలు చేయాలని అనుకున్నా.. పెళ్లిపందిరి విషయంలో తన జడ్జ్ మెంట్ కరెక్ట్ అనిపించడంతో దిల్ సినిమాతో నిర్మాతగా మారానని అన్నారు దిల్ రాజు.

ఒకప్పుడు దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే కంటెంట్ ఉన్న సినిమాగా పేరు వచ్చింది. దిల్ రాజు పేరు పడితే సినిమా పక్కా హిట్ అన్న క్రేజ్ వచ్చింది. టాలీవుడ్ లో కొన్ని పాతుకుపోయిన నిర్మాణ సంస్థలకు ధీటుగా దిల్ రాజు బ్యానర్ సినిమాలు చేస్తూ వచ్చింది. కొత్త దర్శకులను పరిచయం చేస్తూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ దిల్ రాజు తన నిర్మాణ సంస్థని పెద్దదిగా చేసుకుంటూ వచ్చారు.

స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరోపక్క లిమిటెడ్ బడ్జెట్ తో యంగ్ హీరోతో ప్రయోగాలు చేస్తుంటారు దిల్ రాజు. అలా లో బడ్జెట్ సినిమాలతో దిల్ రాజు ఎక్కువ లాభాలు పొందారు. మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు నిర్మాతగా తన పూర్తిస్థాయి ఇన్వాల్వ్ మెంట్ చూపిస్తారు.

కథ విషయంలో కూడా తన ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందంటే ఆయన తన ప్రొడక్షన్ ని ఎలా తీసుకెళ్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. నిర్మాతగా మారిన డిస్ట్రిబ్యూషన్ ని ఆపలేదు దిల్ రాజు. కెరీర్ మొదలు పెట్టింది డిస్ట్రిబ్యూటర్ గానే కాబట్టి అది ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తను నిర్మించే సినిమాలకు పోటీగా వచ్చిన సినిమాలను కూడా దిల్ రాజు ఒక్కోసారి డిస్ట్రిబ్యూట్ చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.