Begin typing your search above and press return to search.

'RC15' కోసం చెన్నైలో దిల్ రాజు కొత్త ఆఫీస్..?

By:  Tupaki Desk   |   27 March 2021 8:30 AM GMT
RC15 కోసం చెన్నైలో దిల్ రాజు కొత్త ఆఫీస్..?
X
'షో మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా' శంకర్‌ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మించనున్నారు. ప్రస్తుతం 'RC15' స్క్రిప్ట్ పనులతో పాటుగా సాంకేతిక నిపుణులు, నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రొడ్యూసర్ దిల్ రాజు చెన్నైలో కొత్తగా ఓ ఆఫీస్ కూడా ఓపెన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

శంకర్ - చరణ్ ల కాంబోలో రానున్న ప్రాజెక్ట్ దగ్గరుండి పర్యవేక్షించడానికి దిల్ రాజు చెన్నైలో ఆఫీస్ తెరవాలనే నిర్ణయం తీసుకున్నట్లు టాక్. అంతేకాక దిల్ రాజు కూడా ఎప్పుడు చెన్నై వెళ్లినా డైరెక్టర్ శంకర్‌ ను కలవడానికి కూడా ఆఫీస్ ఉంటే బాగుంటుందని భావించారట. మొత్తం మీద పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు గట్టిగానే ప్లాన్స్ వేస్తున్నారని అర్థం అవుతోంది. ఇకపోతే ‘ఇండియన్-2’ సంగతి ఎటూ తేలకపోవడంతో 'RC15' ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు శంకర్ మరో సినిమా చేసే ఛాన్స్ లేకుండా దిల్ రాజు లాక్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఏదేమైనా ఈ సినిమా ఆఫర్లు శంకర్ తరహాలోనే భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందనుందని తెలుస్తోంది. రామ్ చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' మరియు 'ఆచార్య' సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.