Begin typing your search above and press return to search.

జబర్దస్త్‌ కమెడియన్‌ ని చాలా నమ్మి పెట్టుబడి పెట్టిన దిల్‌ రాజు

By:  Tupaki Desk   |   2 Oct 2022 7:00 AM IST
జబర్దస్త్‌ కమెడియన్‌ ని చాలా నమ్మి పెట్టుబడి పెట్టిన దిల్‌ రాజు
X
దిల్‌ రాజును కథతో ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు అంటూ చాలా మంది రచయితలు మరియు దర్శకులు అంటూ ఉంటారు. దిల్‌ రాజు ఏదైనా కథకు ఓకే చెప్పాడు.. పూర్తి స్థాయిలో సంతృప్తి చెందాడు అంటే ఆ సినిమా సగానికి పైగా సక్సెస్ అయినట్లే అనే అభిప్రాం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.

అలాంటి దిల్ రాజును మాజీ జబర్దస్త్‌ కమెడియన్‌ వేను టిల్లు తన కథతో ఒప్పించాడట. కేవలం తన కథను చెప్పి ఒప్పించడం మాత్రమే కాకుండా వెంటనే నిర్మించేందుకు కూడా సిద్ధం అయ్యాడట. కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి.. టీవీ షో లు చేసిన కమెడియన్‌ వేణు దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు.

దిల్‌ రాజు ని తన కథతో ఒప్పించడం మాత్రమే కాకుండా దర్శకత్వంతో కూడా వేణు మెప్పించాడట. అందుకే బడ్జెట్‌ విషయంలో వేణు అడిగినంత దిల్‌ రాజు ఇచ్చాడట. షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసిన వేణు త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడట.

తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విషయంలో దిల్‌ రాజు చాలా ఎగ్జైట్‌ గా ఉన్నాడట. ఆయన నిర్మాణంలో చరణ్‌.. శంకర్ మరియు సూపర్ విజయ్ సినిమా కూడా రూపొందుతుంది. అయినా కూడా వేణు చెప్పిన కథ నచ్చి నిర్మించేందుకు సిద్ధం అయ్యాడు అంటే ఆ కథ ఆయన్ను ఎంతగా కదిలించిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన అంత నమ్మకం పెట్టిన సినిమా ను చూడాలని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కోరుకుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.