Begin typing your search above and press return to search.

ఆ సినిమాను దిల్ రాజు వదిలేశాడా?

By:  Tupaki Desk   |   26 Jun 2017 3:56 PM IST
ఆ సినిమాను దిల్ రాజు వదిలేశాడా?
X
దిల్ రాజు అప్పుడప్పుడూ తనకు సంబంధం లేని చిన్న సినిమాల మీద ఓ కన్నేస్తుంటాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమా అనిపిస్తే దాన్ని టేకప్ చేసి సొంత బేనర్లో రిలీజ్ చేస్తుంటాడు. ‘పటాస్’.. ‘కుమారి 21 ఎఫ్’.. ‘సినిమా చూపిస్త మావ’ లాంటి సినిమాల్ని అలాగే విడుదల చేశాడు రాజు. గత ఏడాది చివర్లో ‘వెళ్లిపోమాకే’ అనే చిన్న సినిమాను దిల్ రాజు తన చేతికి తీసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. యాకూబ్ అలీ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. సినిమా చూసి మెచ్చిన రాజు దీనికి ‘వెళ్లిపోమాకే’ అనే టైటిల్ సూచించి దాన్ని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చాడు.

కానీ రాజు చొరవ చూపించిన్పటికీ.. ఈ సినిమా విడుదలకు సరైన ముహూర్తం మాత్రం కుదర్లేదు. పోయినేడాది చివర్లో పెద్దగా పోటీ లేని డేట్ దొరకలేదు. తర్వాత రాజు శతమానం భవతి.. నేను లోకల్ సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. వాటి సంగతి తేల్చేసి.. మార్చి 17న సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయగా.. కొన్నిరోజుల ముందే దిల్ రాజు సతీమణి హఠాన్మరణంతో రిలీజ్ ఆగిపోయింది. ఇక అప్పట్నుంచి ఈ చిత్రం వార్తల్లో లేదు. కొత్త రిలీజ్ డేట్ ఇవ్వలేదు. ఏ అప్ డేట్ ఇవ్వట్లేదు. మధ్యలో రాజు తన సొంత సినిమాల మీదికి దృష్టి మళ్లించాడు. నెల రోజులుగా ‘డీజే’ మీదే ఫోకస్ పెట్టాడు. దీని తర్వాత జులైలో విడుదలయ్యే ‘ఫిదా’పై దృష్టి పెట్టాల్సి ఉంది. ఆగస్టు.. సెప్టెంబరు భారీ సినిమాల సందడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘వెళ్లిపోమాకే’ అసలు బయటికి వస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ఈ సినిమాలో బలమైన కంటెంట్ ఉందని ప్రివ్యూ చూసిన ఇండస్ట్రీ జనాలంటున్నారు. మరి రాజు ఈ సినిమాపై ఎప్పుడు కరుణ చూపిస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/