Begin typing your search above and press return to search.
దిల్ రాజు మళ్ళీ లైన్లోకి వచ్చేశాడు
By: Tupaki Desk | 23 Aug 2017 3:45 PM ISTఅసలు పండగ ఏదైనా.. సీజన్ ఎప్పుడైనా.. సినిమాలు ఎవరు చేసినా.. తను ప్రొడ్యూస్ చేసినా చేయకపోయినా.. దాదాపు ఈ ఏడాది ప్రతీ బాక్సాఫీస్ క్లాషులోనూ దిల్ రాజు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన తను సొంతంగా తీసిన సినిమాలతోనే కాకుండా తను కొనుక్కున్న సినిమాలు డిస్ర్టిబ్యూషన్ చేస్తున్న సినిమాలతో ఎప్పుడూ రేసులో ఉంటూ రచ్చ చేస్తున్నాడు.
ఆల్రెడీ సంక్రాంతికి ఖైదీ నెం 150 అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి వంటి పెద్ద సినిమాలు ఉన్నా కూడా.. తన శతమానం భవతిని దించాడు. ఆ తరువాత వెంటనే రేసులోకి నేను లోకల్ ను తెచ్చాడు. కట్ చేస్తే డిజె దువ్వాడ జగన్నాథమ్ తీసుకొచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఫిదాతో ఫిదా చేశాడు. మొన్నటికి మొన్న ఆగస్టు 11న జరిగిన ముప్పేట యుద్దంలో కూడా దిల్ రాజు కొనుక్కున్న జయ జానకి నాయక.. లై సినిమాలు పోటీలో ఉన్నాయి. ఇప్పుడు సెప్టెంబర్ 1న చక్కగా గ్యాప్ చూసుకుని 'పైసా వసూల్' సినిమా వస్తుంటే.. సెప్టెంబర్ 2న 'వెళ్ళిపోమాకే' అంటూ తను కొనుక్కున్న సినిమా ఒకటి రిలీజ్ చేస్తున్నాడు రాజు గారు. ఆల్రెడీ ఫిదా నుండి కొన్ని ధియేటర్లను లై అండ్ జయ జానకి నాయక సినిమాకు ఎలాట్ చేసినా.. లై పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఆ ధియేటర్లలోనే ఇప్పుడు వెళ్ళిపోమాకే సినిమాను రిలీజ్ చేస్తారట. మొత్తానికి అసలు సంవత్సరంలో బాక్సాఫీస్ దగ్గర ఈయన సినిమా లేని సీజన్ అండ్ రేస్ ఉండేవేమో అనిపిస్తోంది.
దాదాపు ఒక ఏడాది నుండి దిల్ రాజు హోల్డ్ చేస్తూ వస్తున్న చిత్రం 'వెళ్ళిపోమాకే'. తను కొనుక్కొని పేరు మార్చి మాంచి టైమ్ చూసి రిలీజ్ చేస్తానని ముందే చెప్పాడు. యాకూబ్ ఆలి డైరక్షన్లో రూపొందిన ఈ లవ్ స్టోరీలో ఆల్రెడీ ఓ రెండు పాటలు జనాలకు బాగా ఎక్కేశాయి. ఇప్పుడు రాజు గారి ప్లానింగ్ తో కరక్టుగా దసరా హాలిడేస్ మొదలయ్యేనాటికి సినిమాను ధియేటర్లలో ఉంచుతున్నారు. అది సంగతి.