Begin typing your search above and press return to search.
దిల్ రాజు వెనక్కి తగ్గాడు...
By: Tupaki Desk | 6 March 2017 6:13 PM ISTఅందరూ కొత్తవాళ్లు కలిసి తీసిన ‘వెళ్లిపోమాకే’ అనే సినిమా నచ్చి దాన్ని తన బేనర్ మీద రిలీజ్ చేయడానికి అగ్ర నిర్మాత దిల్ రాజు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయి చాన్నాళ్లే అయినా మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేయాలని ఎదురు చూస్తున్నాడు రాజు. తన సినిమాలు శతమానం భవతి.. నేను లోకల్ రిలీజైపోవడంతో ఆయన ‘వెళ్లిపోమాకే’ మీద దృష్టిపెట్టాడు. ఈ మధ్యే ఆడియో వేడుక చేసి మార్చి 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్ణయించాడు. ఐతే ఆ రోజు ఇబ్బడిముబ్బడిగా సినిమాలు వచ్చి పడుతున్న నేపథ్యంలో దిల్ రాజు మనసు మార్చుకున్నాడు. ఈ సినిమాను మార్చి 17కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు.
ఈ నెల 9న తమిళ డబ్బింగ్ మూవీ ‘16’.. 10న చిత్రాంగద.. లక్ష్మీబాంబు.. నగరం.. ఆకతాయి.. ఇలా దాదాపు ఎనిమిది సినిమాలు రిలీజవుతున్నాయి. తనకెంతగానో నచ్చి రిలీజ్ చేస్తున్న సినిమా వీటి మధ్య వార్తల్లో లేకుండా పోతుందేమో అని కంగారు పడిన రాజు.. వారం ఆలస్యంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్సయ్యాడు. మార్చి మూడో వారంలో విద్యార్థులు పూర్తిగా పరీక్షల్లో మునిగిపోయి ఉంటారు. ఫ్యామిలీస్ సినిమాలకు రావు. అయినప్పటికీ ఆ వారమే పోటీ లేకుండా సినిమాను రిలీజ్ చేయడం మేలని ఫిక్సయ్యాడు రాజు. తర్వాతి వారం ‘కాటమరాయుడు’ లాంటి భారీ చిత్రం షెడ్యూల్ అయినా.. ఈ చిన్న సినిమాకు ఒక వారం గ్యాప్ ఉంటే చాలని భావించాడు. మహ్మద్ యాకూబ్ అలీ రూపొందించిన ‘వెళ్లిపోమాకే’లో అందరూ కొత్తవాళ్లే నటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/