Begin typing your search above and press return to search.

దిల్ రాజు చేతిలో పెట్టేశారు!!

By:  Tupaki Desk   |   31 July 2017 9:55 AM GMT
దిల్ రాజు చేతిలో పెట్టేశారు!!
X
ఇప్పుడు సినిమాలను రిలీజ్ చేయాలంటే.. మామూలు నిర్మాతలకు మాత్రం కత్తిమీద సామే. అయితే ఇక్కడ మామూలు నిర్మాతలకే కాదు.. అసలు క్రేజ్ లేని ప్రాజెక్టు దింపితే మాత్రం.. అందులో ఎంతటి పాపులర్ నటుడు ఉన్నా కూడా రిలీజ్ కష్టమే అవుతుంది. ఆల్రెడీ ఆగస్టు 18న ''ఉంగరాల రాంబాబు'' రిలీజ్ అని ప్రకటించేశారు కాని.. ఈ సినిమాను అప్పటికి దించడం కూడా హీరో సునీల్ కు కష్టమే కావొచ్చు అంటున్నారు.

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేం క్రాంతి మాధవ్ డైరక్షన్లో రూపొందిన ఈ ఉంగరాల రాంబాబు సినిమా.. ఇప్పటికే నాలుగైదు రిలీజ్ డేట్లను మిస్సయ్యింది. ముఖ్యంగా సినిమా ట్రైలర్ ఆకట్టుకోకపోవడంతో.. ఈ సినిమాను అస్సలు బయటకు తీసుకురాలేక పోతున్నారట. అందుకే ఇప్పుడు సినిమాను దిల్ రాజు చేతిలో పెట్టాలని డిసైడయ్యారు. ఫిదా సినిమా సక్సెస్ తో ఊపుమీదున్న దిల్ రాజు.. ఈ వారంలో సినిమాను చూసి.. అసలు ఎన్ని ధియేటర్లలో రిలీజ్ చేయాలని.. తాను ఈ ప్రాజెక్టులో ఎలా ఇన్వాల్వ్ అవుతాడో డిసైడవుతాడట. అందుకే ఇప్పుడు రాంబాబు టీమ్ అంతా కూడా దిల్ రాజు రాక కోసం వెయిటింగ్ అని టాక్. చాలా సినిమాలను దిల్ రాజు చూశాక కూడా నచ్చలేదని కొనకుండా వెళ్ళిపోతాడు. మరి ఈ సినిమా పరిస్థితిలో ఏం జరుగుతుందో చూడాలి.

నిజానికి వరుసగా ఫ్లాపులు ఇవ్వడంతో సునీల్ మార్కెట్ చాలా బ్యాడ్ అయ్యిందనే చెప్పాలి. దానికి తోడు సినిమాల్లో కూడా కంటెంట్ అస్సలు ఉండట్లేదు. దాని కారణంగా ఇప్పుడు పంపిణీదారులు మాత్రం ధైర్యం చేయలేకపోతున్నారు.