Begin typing your search above and press return to search.

దిల్ రాజుదీ అదే స్ట్రాటజీ

By:  Tupaki Desk   |   20 Sep 2015 9:30 AM GMT
దిల్ రాజుదీ అదే స్ట్రాటజీ
X
సాయిధరమ్ తేజ్ ను నేను స్టార్ గా చేయబోవడం లేదు.. అతను ఆల్రెడీ స్టార్ అని ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆడియో ఫంక్షన్లో అన్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. అతడి మాటలు నిజమే అన్నట్లుంది పరిస్థితి. సాయిధరమ్ ది రెండు సినిమాల వయసు. అందులో ఒకటి పెద్ద డిజాస్టర్. ఆ డిజాస్టర్ తర్వాతే అతడి మూడో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కానీ ఆ ప్రభావం ఏమాత్రం కనిపించట్లేదు. ఓ స్టార్ హీరో సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అలాగే ఉంది ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ విషయంలో. సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆడియో టీజర్ తో మొదలైన హైప్.. అంతకంతకూ పెరుగుతోంది.

సినిమాలో కంటెంట్ ఉండి.. అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తే ఎలాంటి ఫలితాలుంటాయో.. ఇటీవల శ్రీమంతుడు, భలే భలే మగాడివోయ్ సినిమాలు రుజువు చేశాయి. ఆ రెండూ అంచనాల్ని మించి వసూళ్లు సాధించాయి. దీంతో దిల్ రాజు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ విషయంలో అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. జనాల్లో కూడా సినిమా మీద ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉండటంతో.. అంచనాలు మరింత పెంచేలా ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నాడు. రిలీజ్ వీక్ లోకి వచ్చేయడంతో ఇటు దర్శక నిర్మాతలు.. అటు హీరోయిన్లు ఇంటర్వ్యూలు మొదలుపెట్టేశారు. రోజూ ఏదో ఒక ప్రమోషనల్ ఈవెంట్ ఉంటోంది. సినిమా విడుదలయ్యేసరికి హైప్ బాగా పెంచడానికి ఏం చేయాలో అదంతా చేస్తున్నారు. సినిమా బాగుంటే.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కూడా భలే భలే మగాడివోయ్ తరహాలోనే అనూహ్యమైన కలెక్షన్లు సాధించే అవకాశం కనిపిస్తోంది.