Begin typing your search above and press return to search.

రవితేజ వర్సెస్ సాయిధరమ్ తేజ

By:  Tupaki Desk   |   28 Aug 2017 4:31 AM GMT
రవితేజ వర్సెస్ సాయిధరమ్ తేజ
X
పోటీ ఎవ్వరూ ఉండకూడదనుకున్నాడో ఏమో ఒకే రోజున తాను డీల్ చేస్తున్న రెండు సినిమాలు ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఇంతకి మ్యాటర్ ఏంటంటే దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న రవితేజ సినిమా రాజా ది గ్రేట్ ని దీపావళి కానుకగా అక్టోబర్ 13న విడుదల చేసేందుకు ప్లానింగ్ నడుస్తుంది. అయితే ఇదే రోజున సాయిధరమ్ తేజ్ జవాన్ ను కూడా రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో దిల్ రాజు ఉన్నట్లు సమాచారం. రాజా ది గ్రేట్ ను తానే స్వయంగా నిర్మిస్తున్న దిల్ రాజు మరో వైపున జవాన్ కి కూడా పెట్టుబడి పెట్టినట్లుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి సెప్టెంబర్ లో విడుదల కావాల్సిన జవాన్ చిత్రాన్ని కావాలనే దిల్ రాజు అక్టోబర్ కు పోస్ట్ పోన్ చేశాడనే టాక్ ఉంది. సెప్టేంబర్ లో భారీ సినిమాలు విడుదల ఉండటంతో వాటి మధ్యలోకి జవాన్ వస్తే వసూళ్లు దెబ్బతినే అవకాశం ఉందనే కారణంతోనే దిల్ రాజు విడుదల అక్టోబర్ కి వాయిదా వేసినట్లు తెలిసింది.

అయితే ఇంత చేసిన దిల్ రాజు ఇప్పుడు జవాన్ కి పోటీగా తాన సినిమా రాజా ది గ్రేట్ ని రంగంలోకి దింపడం ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అయింది. దీని పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి జవాన్ చిత్రంలో దిల్ రాజు పెట్టుబడి లేదని, నైజాం, నార్త్ ఆంధ్రా ఏరియాల్లో పంపిణీపరంగా రాజు, జవాన్ కి హెల్ప్ అవుతాడనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా దర్శకనిర్మాతలు రాజు చేతుల్లో ప్రాజెక్ట్ పెట్టారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ కామెంట్స్ కి దిల్ రాజు ఇచ్చే ఆన్సర్ ఏంటో చూడాలి.