Begin typing your search above and press return to search.

బ్లాక్‌ టిక్కెట్లా? ఆ స్థాయికి దిగజార్లేదు

By:  Tupaki Desk   |   15 July 2015 9:56 PM IST
బ్లాక్‌ టిక్కెట్లా? ఆ స్థాయికి దిగజార్లేదు
X
''ఒక సినిమా కోసం బ్లాక్‌ టిక్కెట్లు అమ్మించే స్థాయికి, అమ్ముకునే స్థాయికి ఇంకా దిగజార్లేదు'' అంటున్నారు అగ్ర నిర్మాత దిల్‌ రాజు. ''బాహుబలి'' సినిమా విడుదలైనప్పటి నుండీ హైదరాబాద్‌లోని ట్రేడ్‌ ఎనలిస్టుల కళ్లన్నీ ఆయనపైనే. రిలీజ్‌ రోజు 11 బెనిఫిట్‌ షోలు వేయించి ఏకంగా 1.5 కోట్లు వసూలు చేశారని ఒక టాక్‌. ఇదంతా ఒకెత్తయితే అసలు కౌంటర్‌లోనే ఆయన సొంత ధియేటర్‌ శ్రీరాములు దగ్గర బ్లాక్‌లో 100 రూపాయల టిక్కెట్టును వెయ్యి, 1500లకు అమ్మేశారని ఆరోపిస్తూ కొందరు ఫ్యాన్స్‌ ఏకంగా ఆయనపై పోలీస్‌ కంప్లయింట్‌ కూడా ఇచ్చేశారు.

ఈరోజు సాయంత్రం తిరములలో శ్రీవారిని దర్శించుకున్న దిల్‌ రాజు పైవిధంగా స్పందించారు. బాహుబలి సినిమా తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని బాషల్లో విజయవంతమై మన తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిందని ఆయన అభినందించారు. ''ఏదైనా ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్‌ అయినప్పుడు టిక్కెట్లు బ్లాక్‌లో అమ్మడం అనేది సాధారణంగా చూస్తుంటాం. అంతమాత్రానికి ఆ టిక్కెట్లును తానే అమ్మించాని ఆరోపించడంలో అర్ధం లేదు'' అంటూ దిల్‌ రాజు ఎద్దేవా చేశారు. ఆయన సొంత సినిమా ''కేరింత'' కాస్త నిరాశపరిచినా కూడా, డిస్ట్రిబ్యూషన్‌ చేసిన ''బాహుబలి'' బీభత్సంగా ఆడేస్తుండటంలో దిల్‌ రాజు మాంచి ఉత్సాహం మీద ఉన్నారులేండి.