Begin typing your search above and press return to search.
నేనా డైరెక్టరా అంటున్న దిల్ రాజు
By: Tupaki Desk | 11 Jun 2015 12:45 PM ISTఓ సినిమా ఆడుతుందా లేదా అని జడ్జ్ చేయడంలో దిల్ రాజుకు తిరుగులేదని అంటారు. ఇప్పుడున్న నిర్మాతల్లో 24 శాఖలమీదా పట్టున్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరన్న విషయంలో ఎవరికీ సందేహాల్లేవు. సాధారణంగా సినిమా గురించి కొంచెం అవగాహన పెరగ్గానే మెగా ఫోన్ పట్టేయాలనుకుంటారు. మరి ఈ విషయంలో దిల్ రాజు ఉద్దేశమేంటని అడిగితే.. ''నాకు డైరెక్టర్ అవ్వాలన్న ఆలోచన లేదు. డైరెక్టర్ అయితే తీస్తున్న సినిమాను విపరీతంగా ప్రేమించేసి.. మనం తీస్తున్నదే అద్భుతం అనుకుంటాం. అలా అనుకోకుంటే సినిమా తీయలేం కూడా. నేను డైరెక్టర్ అయితే నా జడ్జిమెంట్ పోతుందని అనుకుంటున్నా. ఓ ప్రేక్షకుడిలా సినిమాను గమనిస్తూ.. నిర్మాతగా కొనసాగడానికే ఇష్టపడతా'' అన్నాడు రాజు.
సినీ పరిశ్రమలో, రాజకీయాల్లో రూమర్లనేవి కామన్ అని.. ఇలాంటివి లైట్ తీసుకోవాలని అంటున్నాడు దిల్ రాజు. ఆ మధ్య రాజు గతంలో తన సినిమాలో నటించిన ఓ హీరోయిన్‌తో ఎఫైర్ నడుపుతున్నాడని కొన్ని రోజుల పాటు పెద్ద రచ్చ జరిగిన మాట వాస్తవమే. రాజు గురించి ఇంకా కొన్ని రూమర్లు కూడా వచ్చాయి. వీటి గురించి రాజు దగ్గర ప్రస్తావిస్తే.. ''నాకు తెలియకుండానే మంచి సినిమాలు తీశా. గుర్తింపు వచ్చింది. ఫేమ్ వచ్చాక మంచితో పాటు చెడు కూడా వెంట వస్తుంది. అయినా సినీ, రాజకీయ రంగాల్లో రూమర్లు కామన్. సర్దుకుపోవాలి. నా వరకు ఏదైనా తప్పు చేస్తే నేనే ఎవరికైనా ఫోన్ చేసి సారీ చెబుతా. మీడియా వాళ్లు నా గురించి ఏదైనా సందేహాలుంటే నేరుగా ఫోన్ చేసి అడగొచ్చు కదా. క్లారిటీ ఇస్తా. కానీ అడగరు. కాబట్టే ఇలాంటి వాటిని గాసిప్స్ అంటాం'' అంటూ తనదైన శైలిలో జవాబిచ్చాడు రాజు.