Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్‌ ను మళ్లీ కలిసిన దిల్‌ రాజు

By:  Tupaki Desk   |   14 April 2021 7:30 AM GMT
అల్లు అర్జున్‌ ను మళ్లీ కలిసిన దిల్‌ రాజు
X
అల్లు అర్జున్‌ ప్రస్తుతం చేస్తున్న పుష్ప మూవీ షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయ్యింది. పుష్ప పూర్తి అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ సినిమా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కాని కొరటాల శివ ఆచార్య పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్‌ 30 సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. దాంతో బన్నీ సినిమా ఆలస్యం అవ్వబోతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లో బన్నీ.. కొరటాల కాంబో మూవీ ఉంటుందని నిర్మాత చెబుతున్నాడు. కొరటాల శివతో సినిమా ఆలస్యం అవ్వబోతున్న నేపథ్యంలో బన్నీ తదుపరి సినిమా డేట్స్ ను తాను దక్కించుకోవాలని దిల్‌ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌ తో రెండేళ్ల క్రితమే సినిమాను చేసేందుకు ఒప్పించిన దిల్‌ రాజు డేట్ల విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది అవుతుంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో బన్నీ హీరోగా 'ఐకాన్‌' సినిమా చేయాలని దిల్‌ రాజు భావిస్తున్నాడు. కాని బన్నీ మాత్రం వెయిట్‌ అండ్‌ సీ అన్నట్లుగా ఐకాన్‌ ను హోల్డ్‌ లో పెడుతూ వచ్చాడు. బన్నీ పుష్ప సినిమా తర్వాత ప్రాజెక్ట్‌ కు గ్యాప్‌ ఉంది కనుక ఆ గ్యాప్‌ లో ఐకాన్‌ ను చేయాల్సిందిగా కోరుతూ నిర్మాత దిల్‌ రాజు నుండి బన్నీకి మెసేజ్ వెళ్లిందట. ఒకటి రెండు రోజుల్లో తప్పకుండా ఐకాన్‌ సినిమాకు సంబంధించి కీలక విషయం అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

వకీల్‌ సాబ్‌ సినిమా సక్సెస్‌ అయితే తప్పకుండా ఐకాన్‌ సినిమాను మొదలు పెట్టడం ఖాయం అంటూ అంతా భావించారు. వేణు శ్రీరామ్‌ కు వకీల్‌ సాబ్‌ సినిమాతో పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కనుక బన్నీ మరో ఆలోచన చేయకుండా వేణు శ్రీరామ్‌ తో సినిమాను మొదలు పెట్టవచ్చంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్‌ హీరోగా దిల్‌ రాజు బ్యానర్‌ లో త్వరలోనే సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. బన్నీ నిర్ణయంపై మొత్తం విషయం ఆధారపడి ఉంది.