Begin typing your search above and press return to search.

ఓటీటీతో డీల్ కోసం అష్ట క‌ష్టాలు ప‌డుతున్న బడా ప్రొడ్యూసర్...?

By:  Tupaki Desk   |   16 Jun 2020 11:00 AM IST
ఓటీటీతో డీల్ కోసం అష్ట క‌ష్టాలు ప‌డుతున్న బడా ప్రొడ్యూసర్...?
X
దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సినీ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే మల్టీప్లెక్సెస్, థియేటర్లు మూసి వేశారు. టాలీవుడ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ రిలీజ్ డేట్లను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దీంతో నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్, థియేటర్ల ఓనర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. అంతేకాకుండా సినిమా మీద ఆధారపడి జీవించే కొన్ని లక్షల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు నిబంధనలు సడలిస్తూ షూటింగులకు అనుమతిస్తున్నాయి. దీంతో ప్రొడ్యూసర్స్ ఆగిపోయిన షూటింగ్స్ మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అయితే కొంతమంది నిర్మాతలకి ఫైనాన్స్ క‌ష్టాలు తప్పడం లేదట. ఇది చిన్న నిర్మాతలకే కాకుండా కొంతమంది పెద్ద నిర్మాతలకు కూడా సమస్యగా మారిందట. వారిలో దిల్ రాజు లాంటి బడా ప్రొడ్యూసర్ కి కూడా అలాంటి సమస్యలే వచ్చి పడ్డాయని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దిల్ రాజుకి థియేట‌ర్స్ మరియు సినిమా డిస్ట్రీబ్యూష‌న్స్ ఉంది. దీంతో ఆయనకి ఇదో అద‌న‌పు వ‌డ్డింపుగా మారిందట. అంతేకాకుండా క్రైసిస్ కి ముందే చాలా థియేట‌ర్స్ తో మ‌ళ్లీ అగ్రిమెంట్స్ రెన్యూవ‌ల్ చేయించుకుని అమౌంట్ కూడా ఇచ్చేసారట దిల్ రాజు అండ్ టీమ్. అందులోనూ ఇప్పటికే మూడు సినిమాల మీద బడ్జెట్ పెట్టి అవి రిలీజ్ కాకపోవడంతో లాక్ అయిపోయి ఉన్నాయి.. దీంతో ఇప్పటికే రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు బయటకి వస్తే దిల్ రాజుకి ఫైనాన్స్ కష్టాలు తప్పుతాయని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ వారితో ఓ ప‌ది సినిమాలు డైరెక్ట్ రిలీజ్ చేసే విధంగా అగ్రిమెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న‌ట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. అయితే అమెజాన్ వారు మాత్రం ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ ఇస్తేనే అగ్రిమెంట్ కి వ‌స్తామ‌ని లేక‌పోతే కుదరదని దిల్ రాజుకు చెప్పారట.

దిల్ రాజు చేతిలో ప్ర‌స్తుతం నాని - సుధీర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'వి' మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వ‌కీల్ సాబ్'.. 'జెర్సీ' హిందీ రీమేక్ సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మ‌రికొన్ని సినిమాలు లైన్ అప్ చేస్తున్నాడట. మ‌రి వాటిలో ఏ సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజులు చేస్తారో చూడాలి. ఇప్పుడు ఇకపై దిల్ రాజు ప్రొడ్యూస్ చేయబోయే సినిమాల షూటింగ్స్ సవ్యంగా ఇప్పటి వరకు లాక్ అయిన బడ్జెట్ లో ఎంతో కొంత తిరిగి రావాలని.. అందుకోసం అష్ట క‌ష్టాలు పడైనా దిల్ రాజు అండ్ టీమ్ తమ సినిమాలను ఓటీటీ రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.