Begin typing your search above and press return to search.

ATM తో డిజిటల్ స్పేస్ లో ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు - హరీష్ శంకర్..!

By:  Tupaki Desk   |   27 Jan 2022 5:16 AM GMT
ATM తో డిజిటల్ స్పేస్ లో ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు - హరీష్ శంకర్..!
X
ఓటీటీలలో వచ్చే ఒరిగినల్ వెబ్ సిరీస్ లకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కుతోంది. అందుకే భవిష్యత్తులో వెబ్ కంటెంట్ హవానే కొనసాగబోతోందని భావిస్తున్న దర్శక నిర్మాతలు, నటీనటులు వెబ్ వరల్డ్ లోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరియు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ డిజిటల్ స్పేస్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు.

ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ జీ5 భాగస్వామ్యంలో దిల్ రాజు - హరీష్ శంకర్ కలిసి ''ATM'' అనే ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. హైదరాబాద్ నగరంలో విచిత్రమైన దొంగతనం జరిగింది.. దీని వెనుక ఇద్దరు మేధావులు ఉన్నారంటూ గత రెండు రోజులుగా ఓటీటీ సంస్థ ఈ ఒరిగినల్ సిరీస్ ని వినూత్న రీతిలో ప్రమోట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా వెబ్ సిరీస్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు.

శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందనున్న ATM వెబ్ సిరీస్ కు హరీష్ శంకర్ కథ అందించడమే కాదు నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. సి. చంద్ర మోహన్ దీనికి స్క్రీన్ ప్లే - దర్శకత్వం వహించనున్నారు.

దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి మరియు అల్లుడు హర్షిత్ రెడ్డి లతో కలిసి హరీష్ ఈ ఒరిగినల్ ను నిర్మించనున్నారు. మరి వెబ్ కంటెంట్ లో దిల్ రాజు ఫ్యామిలీ మరియు హరీష్ శంకర్ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

హైదరాబాద్ లో నలుగురు దొంగలు కలిసి చేయబోయే దొంగతనం నేపథ్యంలో థ్రిల్లింగ్ గా 'ATM' కథని చెప్పబోతున్నారు. ఈ స్క్రిప్ట్ రెడీ చేయడానికి హరీష్ శంకర్ తీవ్రమైన పరిశోధన చేసాడని తెలుస్తోంది. Zee5లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అలానే ఇందులో నటించే నటీనటులు మరియు సిబ్బంది వివరాలు కూడా వెల్లడి కానున్నాయి.