Begin typing your search above and press return to search.

డార్లింగ్ టైటిల్ దిల్ రాజు సినిమాకు??

By:  Tupaki Desk   |   22 Dec 2019 5:30 PM GMT
డార్లింగ్ టైటిల్ దిల్ రాజు సినిమాకు??
X
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఏది అని అడగ్గానే చాలామంది 'జాన్' అని.. 'జాను' అనో చెప్పేస్తారు. ఎందుకంటే చాలాకాలంగా ఈ 'జాను' టైటిల్ ఈ ప్రభాస్ కొత్త సినిమాకు వర్కింగ్ టైటిల్ గా వినిపిస్తోంది. 'సాహో' తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాకే ఇది వర్కింగ్ టైటిల్. అయితే ఈ టైటిల్ మారిపోయేలా ఉందని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది.

ఈ టైటిల్ ను ప్రభాస్ - రాధాకృష్ణ సినిమా నిర్మాతలైన యూవీ వారు ఇంకా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అయితే రీసెంట్ గా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ టైటిల్ ను మరో సినిమాకు ఇవ్వమని యూవీ క్రియేషన్స్ వారిని కోరుతున్నారట. దిల్ రాజు నిర్మాణంలో తమిళ సూపర్ హిట్ మూవీ '96' రీమేక్ తెరకెక్కుతోంది. మొదట్లో సేమ్ టైటిల్ తెలుగులో కూడా పెడదామని అనుకున్నారట. అయితే ఆ ప్లాన్ తర్వాత మారిందట. శర్వానంద్-సమంతా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తెలుగులో నేటివిటీకి తగ్గట్టు కొంత మార్పుచేర్పులు చేశారట. అందులో భాగంగా కొంత కథ 1996 లో కాకుండా 2000 వ సంవత్సరంలో జరుగుతుందట. దీంతో '96' టైటిల్ సూట్ కాదట.

ఈ సినిమాలో హీరోయిన్ పేరు జానకి. జాను అని పిలుస్తారు. అందుకే రాజుగారు 'జాను' టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావిస్తున్నారట. ఈ ఉద్దేశంతోనే యూవీ వారిని ఈ టైటిల్ అడిగారట. ఇప్పటికే ఈ దిశగా చర్చలు కూడా జరిగాయట.రాజుగారికి.. యూవీవారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈ టైటిల్ ను ఇవ్వడానికి యూవీవారు అభ్యంతరం చెప్పకపోవచ్చని అంటున్నారు. ఏ విషయం త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.