Begin typing your search above and press return to search.

ఫీల్ మై ల‌వ్ అనేది మెగాహీరోనేనా?!

By:  Tupaki Desk   |   1 Dec 2015 5:15 AM GMT
ఫీల్ మై ల‌వ్ అనేది మెగాహీరోనేనా?!
X
అవును మెగాహీరోనే క‌దా ఫీల్ మై ల‌వ్ అన్న‌ది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `ఆర్య‌`లో అల్లు అర్జునే క‌దా ఫీల్ మై ల‌వ్... అంటాడు. ఇక ఆ విష‌యంలో కొత్త‌గా సందేహం ఎందుకంటారా? నిజ‌మే కానీ... రెండోసారి మ‌రో మెగా హీరో ఫీల్ మై ల‌వ్ అంటూ పాడేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. ఆ వివ‌రాల్లోకి వెళితే...

ఇటీవ‌ల నిర్మాత దిల్ రాజు ఫిలిం ఛాంబ‌ర్ లో ఫీల్ మై ల‌వ్ అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించాడు. ఈ టైటిల్ బ‌య‌టికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చ‌ర్చ మొద‌లైంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దేవిశ్రీప్ర‌సాద్ న‌టించ‌నున్న సినిమాకోసమే ఆ టైటిల్‌ని ఫిక్స్ చేశార‌ని, అందుకే దాన్ని రిజిస్ట‌ర్ చేయించార‌ని కొంద‌రు, కాదు... కాదు... వేరే సినిమాకోసం ఆ పేరు రిజిస్ట‌ర్ చేయించార‌ని మ‌రికొంద‌రు మాట్లాడుకుంటున్నారు. అయితే విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఆ టైటిల్ మెగా హీరోతో చేయ‌నున్న సినిమాకోస‌మ‌ట‌.

వ‌రుణ్‌ తేజ్ క‌థానాయ‌కుడిగా దిల్‌ రాజు ఓ చిత్రాన్ని నిర్మించే ఆలోచ‌న‌లో ఉన్నాడు. ఆ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి తెర‌కెక్కించ‌నున్నాడట‌. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఆ చిత్రాన్ని జ‌న‌వ‌రిలో ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిసింది. వెంకీ అట్లూరి కూడా ఎవ‌రో కాదు. ఇదివ‌ర‌కు మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన స‌్నేహ‌గీతం సినిమాలో ఓ క‌థానాయ‌కుడు. సందీప్ కిష‌న్ - చైత‌న్యతోపాటు వెంకీ అట్లూరి కూడా అందులో క‌నిపిస్తాడు. స్నేహ‌గీతం త‌ర్వాత న‌ట‌న‌కు దూరమై ద‌ర్శ‌క‌త్వంపైనే దృష్టిపెట్టాడాయ‌న. ఫీల్ మై ల‌వ్ పేరుతో ఓ స్క్రిప్టు రాసుకోవ‌డం, అందుకు దిల్‌ రాజు ఓకే చెప్ప‌డంతో ఆ సినిమాకి సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి.