Begin typing your search above and press return to search.

2019లో హ్యాట్రిక్ పై క‌న్నేసిన దిల్ రాజు

By:  Tupaki Desk   |   23 March 2019 5:39 PM GMT
2019లో హ్యాట్రిక్ పై క‌న్నేసిన దిల్ రాజు
X
నిహారిక క‌థానాయిక‌గా న‌టించిన సూర్య‌కాంతం ఈనెల 29న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. నేటి సాయంత్రం జెఆర్‌సీలోని ఆడియో వేడుక‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ ముఖ్య అతిధిగా ఎటెండ్ అయ్యారు. ఇక ఈ సినిమా నైజాం పంపిణీ హ‌క్కులు ఛేజిక్కించుకున్న దిల్ రాజు సినిమాలో కంటెంట్ పై పూర్తి న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ఎఫ్ 2 తో తొలి విజ‌యం ద‌క్కింది. ఆ త‌ర్వాత 118తో రెండో హిట్ ద‌క్కింది. `సూర్య‌కాంతం`తో మూడో విజ‌యం అందుకుంటామ‌ని దిల్ రాజు అన్నారు.

ఇక ఈ సినిమాలో న‌టించిన నిహారిక పెర్ఫామెన్స్ కి దిల్ రాజు కితాబిచ్చారు. ఇప్ప‌టికే ఈ సినిమాని వీక్షించాను. ఇందులో నిహారిక‌తో పాటు హీరో రాహుల్ విజ‌య్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. ఇద్ద‌రు అమ్మాయిల మ‌ధ్య న‌లిగిపోయే కుర్రాడిగా రాహుల్ విజ‌య్ చ‌క్క‌గా న‌టించాడ‌ని దిల్ రాజు కితాబిచ్చాడు. రాహుల్ న‌టించిన మొద‌టి సినిమాని ప్ర‌మోట్ చేయ‌మ‌ని ఎంత‌గా వెంట‌ప‌డినా తాను చేయ‌లేద‌ని, ఇప్పుడు సూర్య‌కాంతం సినిమా చూశాక మాత్రం రాహుల్ విజ‌య్ పెద్ద స‌క్సెస‌వుతాడ‌ని చెబుతున్నాన‌ని దిల్ రాజు అన్నారు. ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ కుమారుడు అని చెప్ప‌డం లేదు. అత‌డిలో మంచి న‌టుడు ఉన్నాడు. అందుకే ప్రోత్స‌హిస్తున్నాను అని అన్నారు దిల్ రాజు.

ఇదే వేదిక‌పై దిల్ రాజును మీ జీవితంలోని సూర్య‌కాంతం ఎవ‌రు? అని ప్ర‌శ్నిస్తే ఆయ‌న స్పందించిన తీరు ఆస‌క్తిక‌రం. నా లైఫ్ లోనే కాదు, ఎవ‌రి లైఫ్ లోనూ ఇలాంటి సూర్య‌కాంతం ఉండ‌కూడ‌దు! అంటూ భ‌యాన్ని వ్య‌క్తం చేశారు. మొత్తానికి ఇప్ప‌టికే సినిమాని వీక్షించిన రాజుగారికి సూర్య‌కాంతంగా నిహారిక‌ న‌ట‌న‌, హీరో రాహుల్ విజ‌య్ న‌ట‌న బాగానే క‌నెక్ట‌య్యాయ‌ని అర్థమ‌వుతోంది. అందుకే ఆయ‌న ఆ ఇద్ద‌రికీ ప్ర‌త్యేకంగా బ్లెస్సింగ్ ఇచ్చారు. ఇక ఈ సినిమాతో 2019లో హ్యాట్రిక్ అందుకుంటాన‌ని దిల్ రాజు ధీమాని వ్య‌క్తం చేశారంటే ఆయ‌న కాన్ఫిడెన్స్ ని అర్థం చేసుకోవ‌చ్చు.