Begin typing your search above and press return to search.

భారతీయుడు 2 తియ్యొద్దని చెప్పారట

By:  Tupaki Desk   |   18 Dec 2017 7:09 AM GMT
భారతీయుడు 2 తియ్యొద్దని చెప్పారట
X
మొన్నామధ్యన.. ఒకే స్టేజీపై నిర్మాత దిల్ రాజ్.. బిగ్గెస్ట కమర్షియల్ డైరక్టర్ శంకర్.. విశ్వనటుడు కమల్ హాసని కనిపించి.. ''భారతీయుడు 2'' సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఈ సినిమా టేకాఫ్‌ కావట్లేదని అనేక రూమర్లు వినిపించాయి. అయితే ఈ సినిమాను ఎందుకు ప్రకటించినట్లు? ఎందుకు వద్దనుకున్నట్లు? అంటూ చాలామంది దిల్ రాజును అడిగినా.. ఇప్పటివరకు రిప్లయ్ రాలేదు కాని.. ఇప్పుడు మాత్రం ఆయన తేల్చేశారు.

''కొంతమంది శ్రేయోభిలాషులు నన్ను భారతీయుడు 2 సినిమా చేయొద్దన్నారు. అందుకే డ్రాప్ అయిపోయాను'' అంటూ ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో దిల్ రాజు పేర్కొన్నారు. కేవలం నవ్వుతూ ఆ సినిమా నుండి తప్పుకున్నా అంటూ దిల్ రాజు చెప్పేశారు కాని.. దీని వెనుక చాలా తతంతంగం నడించిందట. ఒక ప్రక్కన కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్న లైకా ప్రొడక్షన్స్ వంటి నిర్మాతలే దర్శకుడు శంకర్ డిమాండ్లతో విస్తుపోతున్నారు. ఆయన అడిగే ఖరీదైన కోరికలు అలా ఉంటాయి మరి. కాబట్టి దిల్ రాజు ఆయన్ని తట్టుకునే సీన్ లేదు.

పైగా ఇప్పుడు కష్టపడి వరుస హిట్టులు కొట్టి తను లాభంగా అర్జించిన 100 కోట్లను శంకర్ సినిమాపై పెట్టేస్తే.. ఖచ్చితంగా చివర్లో అప్పుల భారీన పడాల్సి వస్తుందని దిల్ రాజుకు ఆయన అన్నదమ్ములే రియలైజ్ చేయించారట. అందుకే ఆయన సినిమా నుండి డ్రాప్ అయినట్లు ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోందిలే. కాని రాజు గారు మాత్రం.. ఏ కొంచెం కాంట్రోవర్శీ అనేదే లేకుండా.. చక్కగా భారతీయుడు 2 నుండి డ్రాప్ అయ్యా అంటూ చెప్పేశారు.