Begin typing your search above and press return to search.

బాహుబలి ఎఫెక్ట్: డిజె కు పాతిక ప్లస్

By:  Tupaki Desk   |   16 Jun 2017 8:00 AM GMT
బాహుబలి ఎఫెక్ట్: డిజె కు పాతిక ప్లస్
X
ఒక సినిమా పెద్ద హిట్టయ్యిందంటే ఆటోమ్యాటిక్ గా తదుపరి వచ్చే సినిమాలపైనా భారీ అంచనాలు ఉంటాయి. ఇది హీరో అండ్ డైరక్టర్ విషయంలో తెగ వర్తించేది కాని.. ఇప్పుడు ఒక సినిమా హిట్టయితే ఏకంగా మార్కెట్ స్థాయే పెరిగిపోతోంది. థ్యాంక్స్ టు బాహుబలి సిరీస్. బాహుబలి 1వ పార్టు రిలీజైనప్పుడు క్రియేట్ అయిన మార్కెట్ ప్రభంజనం.. ఆ తరువాత శ్రీమంతుడు సినిమాకు బాగా ఉపయోగపడింది. ఇప్పుడు బాహుబలి 2తో కూడా అలాంటి ప్రభంజనమే వచ్చింది కాబట్టి.. బాక్సాఫీస్ దగ్గర దానిని ఉపయోగించుకునే సినిమా ఏది?

సమ్మర్లో వచ్చిన రారండోయ్ వేడుకచూద్దాం వంటి సినిమాలు ఆ వసూళ్ల స్థాయినీ.. ఎంటర్టయిన్మెంట్ కు ఉన్న డిమాండ్ ను పూర్తిగా ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయడానికి ''డిజె దువ్వాడ జగన్నాథమ్'' సినిమా వస్తోంది. ఒక పెద్ద హీరో సినిమా కాబట్టి.. ఖచ్చితంగా పెద్ద రేంజులో బాహుబలి 2 వలన క్రియేట్ అయిన మార్కెట్ వాల్యూను వాడుకునే ఛాన్సుంటుంది. ఛాన్సు ఉండటం కాదు.. ఆల్రెడీ డిజె వాడేసుకున్నాడు కూడా. ఎందుకంటే ఆల్రెడీ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను 25 కోట్ల రూపాయల ప్రాఫిట్ కు అమ్మేశారట. సినిమా రిలీజ్ కాకముందే పాతిక ప్లస్సులో ఉన్నారంటే.. అసలు మార్కెట్లో క్రేజు ఎలా ఉందో చూసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న బన్నీ మార్కెట్ కు.. ఈ సినిమాకు ఉన్న క్రేజుకూ.. బాహుబలి 2 ఎఫెక్ట్ కలిపితే.. ఈ రేంజులో లాభాలొచ్చేశాయి. ఇక సినిమా కూడా వర్కవుట్ అయ్యిందంటే.. కొనుక్కున్న బయ్యర్లకు కూడా అంతే రేంజులో లాభాలొచ్చే ఛాన్సుంది.

ఈ నెల 23న విడుదల కాబోతున్న ఈ సినిమా.. మరి ఖచ్చితంగా 100 కోట్ల షేర్ కొడుతుందని ఒక అంచనా కూడా ఉంది. అప్పట్లో బాహుబలి 1 తరువాత వచ్చిన శ్రీమంతుడు 80+ షేర్ తో రికార్డు నెలకొల్పింది కాబట్టి.. ఇప్పుడు డిజె కూడా అలాంటి రికార్డు బ్రేకింగ్ ఫీట్ చేసి.. నెం.2 పొజిషన్లో ఉన్న రికార్డులను ఏమన్నా కదిలిస్తుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/