Begin typing your search above and press return to search.

నాన్న నీ కొత్త జీవితం సంతోషంగా సాగాలి : దిల్‌ రాజు కూతురు

By:  Tupaki Desk   |   11 May 2020 1:30 PM IST
నాన్న నీ కొత్త జీవితం సంతోషంగా సాగాలి : దిల్‌ రాజు కూతురు
X
టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు నిన్న రాత్రి నిజామాబాద్‌ జిల్లా నార్సింగ్‌ పల్లిలో తాను కట్టించిన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో రెండవ వివాహం చేసుకున్నాడు. పెళ్లి విషయాన్ని ముందు రోజే దిల్‌ రాజు అధికారికంగా ప్రకటించాడు. మూడు నెలల క్రితం వార్తలు వచ్చినా కూడా అవి పుకార్లంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కొట్టి పారేశారు. కాని దిల్‌ రాజు ఆ పుకార్లు నిజం చేస్తూ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. 2017లో దిల్‌ రాజు భార్య అనిత గారు అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుండి కూడా దిల్‌ రాజు ఒంటరిగా ఉంటున్నాడు. దిల్‌ రాజు కూతురు హన్షితా ఈ పెళ్లి పెద్దగా వ్యవహరించారు. ఆమె బలవంతంతోనే ఆయన ఈ వివాహం చేసుకున్నారట.

నాన్న పెళ్లి తర్వాత హన్షితా ఎమోషనల్‌ గా విషెష్‌ తెలియజేశారు. ఆమె... ప్రియమైన నాన్న అన్ని వేళల్లో నువ్వు నాకు తోడుగా నిలబడ్డావు. నువ్వే నాకు అతి పెద్ద బలం. నువ్వు ఎప్పుడూ నాకు అండగా ఉంటూ వచ్చినందుకు కృతజ్ఞతలు. మన కుటుంబం సంతోషం కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. మా సంతోషమే నీకు ముఖ్యంగా అనుకున్నావు. జీవితంలో నువ్వు ప్రారంభించిన ఈ కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలి. మీరిద్దరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి రోజు మీకు అద్బుతంగా సాగాలంటూ ఆశిస్తూ ఉన్నాను. ఐ లవ్‌ యూ అంటూ ఒక లేఖను రాశారు.

దిల్‌ రాజు కూతురు లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తండ్రి సంతోషం కోసం హన్షితా చేసిన పనిని అంతా అభినందిస్తున్నారు. ఈ సందర్బంగా దిల్‌ రాజుకు టాలీవుడ్‌ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వివాహంలో సినీ ప్రముఖులు ఎవరు కనిపించలేదు. త్వరలోనే తనకు అత్యంత ఆప్తులకు దిల్‌ రాజు పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.