Begin typing your search above and press return to search.

'వ‌కీల్ సాబ్' వ‌సూళ్లు అడిగితే ఆయ‌న న‌సుగుడేంది?

By:  Tupaki Desk   |   18 April 2021 8:00 AM IST
వ‌కీల్ సాబ్ వ‌సూళ్లు అడిగితే ఆయ‌న న‌సుగుడేంది?
X
ఓపెన్ చేయ‌డం కంటే దాచి ఉంచ‌డ‌మే క‌ష్టం. అరిచేతిలో దేనినీ దాచి ఉంచ‌లేం.. అది ఏదో ఒకసారి ఓపెన్ చేయాల్సిందే అనుకుంటాం కానీ రాజుగారి అరిచేతిని ఓపెన్ చేయించి నోట మాట ర‌ప్పించ‌డం అంత సులువేమీ కాదు. ఆయ‌నంతట ఆయ‌న చెప్పాలే కానీ బ్ర‌హ్మ‌కైనా అన‌వ‌స‌ర స‌మాచారం లీక్ చేయడానికి ఆయ‌న ఇష్ట‌ప‌డ‌రు.

వ‌కీల్ సాబ్ మీడియా స‌మావేశంలోనూ ఆయ‌న నుంచి ఒక్క మాట కూడా మాట్లాడించ‌లేక చాలా స‌త‌మ‌త‌మ‌వ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అస‌లు వ‌కీల్ సాబ్ ఎంత వ‌సూలు చేసింది రాజు గారూ? అని ప్ర‌శ్నిస్తే ఆయ‌న నుంచి క‌ట్టె కొట్టె తెచ్చే త‌ర‌హాలో జ‌వాబు వ‌చ్చింది. ఎంత రావాలో అంతా వ‌చ్చింది. వ‌కీల్ సాబ్ నుంచి ఎంత తేవాల‌నుకున్నానో అంతా తెచ్చేశాం అంటూ ముక్త‌స‌రిగా జ‌వాబిచ్చారు రాజుగారు. అంతేకానీ మా సినిమా 100 కోట్ల వ‌సూళ్లు సాధించింది అంటూ భ‌జ‌న మాత్రం చేయ‌లేదు.

ఈ సినిమా ఇప్ప‌టికే 94కోట్ల షేర్ వ‌సూలు చేసింది అంటూ వాట్సాప్ గ్రూపుల్లో ప్ర‌చారం సాగుతోంది. అభిమానులు అంత‌కుమించి చెబుతున్నారు. ట్రేడ్ లెక్క వేరొక‌లా ఉంది. కానీ రాజుగారు మాత్రం పెద‌వి మెద‌ప‌రు. రెండు వారాల త‌ర్వాత కూడా ఆయ‌న వ‌సూళ్లు బ‌య‌ట‌పెట్ట‌లేదు.

నేను చాలా కాలిక్యులేటెడ్ .. పెట్టింది వెన‌క్కి తెచ్చేశాం. వకీల్ సాబ్ విషయంలో కూడా నా టార్గెట్ నేను వంద శాతం చేరుకున్నాను! అని మాత్రం తెలిపారు దిల్ రాజు. నిజానికి తొలి నాలుగు రోజులు చేసినంత‌గా ఆ త‌ర్వాత వ‌సూళ్లు లేనే లేవ‌ని థియేట‌ర్లు ఖాళీ అయిపోయాయ‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది. కానీ టార్గెట్ రీచ్ అయ్యామ‌ని.. ఈ సినిమాని డ‌బ్బు కోసం కాకుండా ఫేవ‌రెట్ స్టార్ కోసం చేశాన‌ని రాజు గారు అన‌డం కొస‌మెరుపు. 50శాతం ఆక్యుపెన్సీ ఉన్నా వ‌కీల్ సాబ్ ధీమాగా థియేట‌ర్ల‌లో కొన‌సాగుతుంద‌ని దిల్ రాజు వెల్ల‌డించారు.